నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజిత్ వదిలిన ఓజి యూనివర్స్ వీడియో మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కారణం ఏఐ వాడకం. జపాన్ సమురాయ్ విజువల్స్, సుభాష్ చంద్ర బోస్ లింక్, యోధుడి దుస్తుల్లో ఉన్న ఓజాస్ గంభీర గెటప్ ఇవన్నీ కొంచెం కృతకంగా ఉన్నాయి. అంటే ఏఐ వాడి చేశారని నెటిజెన్ల కామెంట్. అలా కాకుండా ఒరిజినల్ యానిమేషన్ చేయించి క్వాలిటీ మీద శ్రద్ధ వహించి ఉంటే నెగటివ్ అన్న ప్రసక్తే వచ్చి ఉండేది కాదన్నది వాస్తవం.
ఎందుకిలా చేశారంటే బర్త్ డేకి ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలన్న ఒత్తిడి తప్ప మరొకటి కాదు. నిజానికి ఇవ్వకపోయినా ఎలాంటి నష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ పూర్తిగా పంజా మూడ్ లో ఉన్నారు. నిన్న ఏపీ తెలంగాణ థియేటర్లన్నీ జనంతో ఫుల్ అయ్యాయి. మంచి రెవిన్యూ వచ్చింది. ఫస్ట్ డే మూడు కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని టాక్. కొత్త రిలీజులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రన్ రాదు కానీ లేదంటే వీకెండ్ వరకు బలంగా నిలబడే సత్తా పంజాకు ఉంది.
నిజానికి ఓజి 2 మీద అభిమానులు ఆసక్తిగా ఉన్నారు కానీ మరీ బాహుబలి రేంజ్ లో ఏదో ఒకటి చెప్పకపోతే ఏదో అయిపోతాం అనే లెవెల్ లో అయితే కాదు. కానీ టీమ్ మాత్రం ఆ స్థాయిలో ఊహించేసుకుంది. అందుకే ఏఐ జొప్పించేసి అంత పెద్ద వీడియో వదిలారు. సరిగ్గా పడి ఉంటే సోషల్ మీడియా ఊగిపోవాల్సిన కాన్సెప్ట్ ఇది. తీరా చూస్తే స్వంత ఫ్యాన్స్ పెద్దగా వైరల్ చేసినట్టు కనిపించలేదు. దీన్ని బట్టే వాళ్లకు ప్రమోషన్ కాన్సెప్ట్ అంతగా నచ్చలేదనేది అర్థమవుతోంది.
షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా చాలా టైం ఉన్న ఓజి 2 మరుసటి ఏడాది అంటే 2028 కన్నా ముందు వచ్చే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే సుజిత్ ముందు నాని బ్లడీ రోమియో పూర్తి చేసుకుని రావాలి. ఆ తర్వాత ఓజి 2 సంగతి చూడాలి. అంటే ఎంత లేదన్నా సంవత్సరం పైనే సమయం కావాలి. అలాంటప్పుడు అప్డేట్స్ స్లోగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. మొదటి భాగానికి అదిరిపోయే బీజీఎమ్ ఇచ్చిన తమన్ ఇప్పుడీ ప్రోమో వీడియోలో అంత మేజిక్ చేయలేకపోయింది.
This post was last modified on September 3, 2026 1:20 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…