Movie News

దుల్కర్ బెస్ట్ ‘సీతారామం’ కాదట

మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. కానీ అతను సొంత భాషను మించి తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేశాడు. తిరుగులేని గుర్తింపు సంపాదించాడు. ఐతే దుల్కర్ ఎన్ని సినిమాలు చేసినా.. ‘సీతారామం’ను మించే చిత్రం తన నుంచి రావడం కష్టమే అనుకున్నారంతా.

కానీ ‘లక్కీ భాస్కర్’తో దానికి దీటుగా నిలిచే సినిమాను అందించాడు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమా రీచ్ విషయమై తాజాగా వెంకీతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా దుల్కరే ఆశ్చర్యపోయాడు. తన కెరీర్లో ‘సీతారామం’ చిత్రమే టాప్‌లో నిలుస్తుందని.. అందులో మేజర్ రామ్‌గానే ప్రేక్షకులకు గుర్తుండిపోతానని.. దాన్ని మించిన సినిమా చేయడం కష్టమని అనుకున్నానని.. కానీ ‘లక్కీ భాస్కర్’ దాన్ని మించిపోయిందని దుల్కర్ చెప్పడం విశేషం.

తన కొత్త చిత్రం షూటింగ్‌ కోసం తాను నెల రోజులు బుడాపెస్ట్‌లో ఉన్నానని.. అక్కడున్న భారతీయులతో పాటు బంగ్లాదేశీయులు, టిబెటన్లు, ఇంకా అనేక దేశాల వాళ్లు తనను ‘లక్కీ భాస్కర్’ సినిమా నటుడిగానే గుర్తుపట్టారని దుల్కర్ తెలిపాడు. తన దగ్గరికి వచ్చేవాళ్లు కాసేపు పరిశీలనగా చూస్తారని.. తర్వాత ఫోన్ తీసుకుని ‘లక్కీ భాస్కర్’ వీడియో చూపిస్తూ.. మీరు భాస్కర్ కదా అని అంటారని.. ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కొన్నానని దుల్కర్ తెలిపాడు.

తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎంత దూరం వెళ్తాడో చూపించిన సినిమా ‘లక్కీ భాస్కర్’ అని.. అందుకే జనాలు ఆ సినిమాతో, ఆ పాత్రతో విపరీతంగా కనెక్ట్ అయ్యారని దుల్కర్ తెలిపాడు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ చేద్దామంటే ఎప్పుడంటే అప్పుడు తాను రెడీగా ఉంటానని దుల్కర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వెంకీ అట్లూరి స్పందిస్తూ.. మీ కమిట్మెంట్లు అన్నీ అయిపోగానే వెంటనే ‘లక్కీ భాస్కర్-2’ చేద్దామంటూ.,. మరింత భయం, బాధ్యతతో స్క్రిప్టు రెడీ చేస్తానని చెప్పాడు.

This post was last modified on September 2, 2026 9:46 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

24 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

53 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago