అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్ 2 కనక అక్టోబర్ 15 రాకపోతే ఆ స్లాట్ తీసుకోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగింది. దానికి తగ్గట్టే రజినీకాంత్ సినిమా కొంత భాగం రీ షూట్ జరుగుతోందని, ఆలస్యం కావొచ్చనే కోణంలో టాక్ బయటికి రావడంతో పోస్ట్ పోన్ ఉంటుందేమోనని చాలా మంది భావించారు. ఇదంతా గమనించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మరోసారి జైలర్ 2 కన్ఫర్మేషన్ ఇచ్చేసింది.
సో వీలైనంత త్వరగా ఆదర్శ కుటుంబం నిర్ణయం తీసుకోవాలి. అక్టోబర్ 9 మంచి ఆప్షన్ మిగిలి ఉంది. కానీ ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ డెడ్ లైన్ అందుకోగలరానే దాని మీద అనుమానాలు లేకపోలేదు. సెప్టెంబర్ 11 నుంచి ప్యాచ్ వర్క్ మొదలుపెడతారని సమాచారం. ఒకవేళ జైలర్ 2 క్లాష్ అయినా పర్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అక్టోబర్ 16 విజయ్ దేవరకొండ రణబాలి ఆల్రెడీ డేట్ వేసుకుని ఉంది.
ధనుష్ ఓమ్ కూడా అదే టైంలో వచ్చేలా ఉంది కానీ దాని వల్ల తెలుగులో పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు అలాని మరీ తక్కువ అంచనా అయితే వేయలేం. సో అక్టోబర్ 9 వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ హారిక హాసిని సంస్థ ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకుందో ప్రస్తుతానికి లీక్ అయితే కాలేదు. తమన్ రీ రీరికార్డింగ్ తో పాటు ప్రమోషన్లకు తగినంత సమయం పెట్టుకోవాలి. అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికి ఆదర్శ కుటుంబంకు చేసిన ప్రమోషన్లు విపరీతమైన హైప్ అయితే తీసుకురాలేదు. పాత్రలను పరిచయం చేసిన టీజర్లు జస్ట్ ఓకే అనిపించాయి. భలే ఉందనిపించే కంటెంట్ ఏదైనా రిలీజ్ చేస్తే గ్రౌండ్ లెవెల్ లో ఊపొస్తుంది. బడ్జెట్ భారీగానే పెడుతున్న ఈ ఎంటర్ టైనర్ లో కేవలం వినోదమే కాకుండా యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. అతడు, జులాయి స్టైల్ లో త్రివిక్రమ్ ఈసారి కొత్త ట్రీట్ మెంట్ లో వెంకటేష్ ఫ్యామిలీని చూపిస్తారని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on September 2, 2026 1:22 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…