వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల ఇంకో ముప్పై రెండు రోజుల్లో ఉంది. అయితే నెల కింద వదిలిన క్యారెక్టర్ టీజర్ల తర్వాత హారికా హాసిని సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. నాగవంశీ మొన్నటిదాకా విశ్వనాథ్ అండ్ సన్స్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదనుకున్నా, వెంటనే రంగంలోకి దిగాలని వెంకటేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీని కన్నా జనవరి 12 విడుదల సౌండ్ ఎక్కువగా ఉందని ఫీలవుతున్నారు.
ఇదిలా ఉండగా ఆదర్శ కుటుంబంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ రీమిక్స్ ప్లాన్ చేశారట. బొబ్బిలి రాజాలో బలపంపట్టి భామ బళ్ళో, కూలి నెంబర్ వన్ లో దండాలయ్యా ఉండ్రాలయ్యాని ఫస్ట్ ఆప్షన్స్ గా పెట్టుకున్నారట. అయితే ఈ రెండు సురేష్ సంస్థ స్వంత సినిమాలే అయినప్పటికీ రీమిక్స్ చేయాలంటే ఇళయరాజా అనుమతి కావాలి. ఒకవేళ ఏం కాదని వాడుకున్నా తర్వాత కోర్టు కేసులంటూ లేనిపోని తలనెప్పి. రాజా వైపు నుంచి సానుకూల సమాధానం రాలేదని వినికిడి.
ప్రేమించుకుందాం రాలో పెళ్లి కళ వచ్చేసిందే బాలా సాంగ్ కూడా పరిశీలనలో ఉందట. ఈ సాంగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సంగీత దర్శకుడు మహేష్ చాలా కాలం క్రితమే చనిపోయారు. కాబట్టి మ్యూజిక్ కంపెనీ దగ్గర హక్కులు కొంటే సరిపోతుంది. మరో రెండు ఆప్షన్లు కూడా చూస్తున్నారట. వీటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయడమో లేదా అల వైకుంఠపురములో తరహాలో అన్ని కొంచెం కొంచెం మిక్స్ చేస్తారేమో చూడాలి. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
అక్టోబర్ 2 ఎంతో దూరంలో లేకపోవడంతో టీమ్ అయితే పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలి. టైం తక్కువగా ఉంది. ప్యాన్ ఇండియా మూవీ కాదని నెమ్మదిగా ఉండటానికి లేదు. ఎందుకంటే వెంకటేష్ స్టామినా మూడు వందల కోట్లకు పైనే ఉందని సంక్రాంతికి వస్తున్నాం నిరూపించింది. అది మరోసారి రిపీట్ చేయాలనీ వెంకీ ఫ్యాన్స్ డిమాండ్. త్రివిక్రమ్ వాళ్ళ అంచనాలకు తగ్గట్టే క్లాస్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పొందుపరిచారట. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates