మహాభారత కథతో గతంలో సినిమాలు వచ్చాయి. భవిష్యత్తులోనూ రాబోతున్నాయి. రాజమౌళి సైతం ఆ కథను భారీ స్థాయిలో తీయాలని కలలు కంటున్నాడు. ఇంతలో రామ్ గోపాల్ వర్మ కూడా మహాభారతం అందించడానికి సిద్ధమైపోయాడు. వర్మ ఏంటే.. ఇలాంటి మైథలాజికల్ మూవీ చేయడమేంటి అని సందేహం కలుగుతోందా? ఐతే వర్మ గారి మహాభారతం స్టైలే వేరులెండి. మాఫియా కథను మహాభారతం తరహాలో భారీ తరహాలో తరహాలో చేయనున్నాడట.
సత్య, కంపెనీ, సర్కార్ లాంటి మాఫియా కథల్ని చాలా బాగా తీసి గొప్ప పేరు సంపాదించిన వర్మ.. గత పదేళ్లలో తన స్థాయికి తగని సినిమాలతో పూర్తిగా పతనం అయిపోయాడు. ఈ మధ్య ఆయన్నుంచి ఎంత నాసిరకం సినిమాలు వచ్చాయో తెలిసిందే. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో మరీ చీప్ సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్లోకి వెళ్తున్నాడు.
‘డి కంపెనీ’ పేరుతో ఆయన ఇంతకుముందే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద మాఫియా డాన్లలో ఒకడైన దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నేరుగా దావూద్ కథ ఇదని వర్మ చెప్పట్లేదు. కానీ టైటిల్ చూస్తేనే ఇది ఎవరి కథ అన్నది అర్థమైపోతోంది. మాఫియా కథల్లో ఇది మహాభారతం లాంటిదని వర్మ పేర్కొనడం విశేషం. ఎప్పట్లాగే చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను కూడా పూర్తి చేసేశాడు వర్మ. ఈ నెల 23న ‘డి కంపెనీ’ ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది.
ఒక వ్యక్తి చేతిలో ఉన్న గన్నునే దీని ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేసి.. తన సినిమా ఎలా ఉండబోతోందో చాటాడు వర్మ. అండర్ వరల్డ్‌కు సంబంధించి దావూద్ ఇబ్రహీం విజన్.. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్‌ల విజన్ కన్నా గొప్పది అంటూ ఈ సినిమాకు క్యాప్షన్ పెట్టాడు వర్మ. వీటికి తోడు ‘మహాభారత్ ఆఫ్ అండర్ వరల్డ్’.. ‘ఎన్ అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్’ అనే క్యాప్షన్లు కూడా జోడించాడు. మరి ఈ సినిమాతో అయినా వర్మ తన పూర్వపు స్థాయిని అందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on January 15, 2021 6:04 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…