సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే కమర్షియల్ కథల్లో భారీ హంగులు తీసుకొచ్చి, సందేశాన్ని పెడుతూనే మాస్ ని మెప్పించే నేర్పు వీళిద్దరికే సొంతం. అందుకే శంకర్ జెంటిల్ మెన్ నుంచి రోబో దాకా మర్చిపోలేని బ్లాక్ బస్టర్లు ఇస్తే మురుగదాస్ గజిని, తుపాకీ లాంటి క్లాసిక్స్ తో సదరు హీరోల కెరీర్ ని పది మెట్లు పైకి ఎక్కించేశారు. ఇదంతా గతం. తర్వాత ఈ జంట ఇచ్చిన ఫ్లాపులది పెద్ద చరిత్ర.
తాజాగా వినపడుతున్న టాక్ నిజమే అయితే త్వరలో ఈ ఇద్దరూ చేతులు కలపబోతున్నారు. మురుగదాస్ అందించిన కథకు శంకర్ డైరెక్షన్ చేస్తారట. ప్రాథమికంగా ఓకే అయిపోయిందని, కాకపోతే వీళ్ళను కలిపి బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరో ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు శంకర్ ఇమేజ్ ని చాలా డ్యామేజ్ చేశాయి. అవి తీసుకొచ్చిన నష్టాల గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. వీటి వల్లే ఆయన డ్రీం ప్రాజెక్ట్ వేల్పరికి పెట్టుబడులు దొరకడం లేదు.
మురుగదాస్ స్టోరీ కూడా భిన్నంగా ఏమి లేదు. శివ కార్తికేయన్ ఎంతో నమ్మకంతో మదరాసి చేస్తే అదేమో సూపర్ ఫ్లాప్ అయ్యింది. ఇది కాస్త నయం. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ సికందర్ మరీ అన్యాయం. అసలది తీసింది దాసేనా అని అనుమానం వచ్చేంత దారుణమైన ఫలితం అందుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కాంబో మీద బిజినెస్ వర్గాల్లో క్రేజ్ రావడం కొంచెం అనుమానమే. కాకపోతే సాలిడ్ స్క్రిప్ట్ ఏదైనా రాసుకుని రీజనబుల్ బడ్జెట్ లో తీస్తే వర్కౌట్ కావొచ్చు.
మూవీ లవర్స్ మాత్రం ఇద్దరూ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు తమకు మర్చిపోలేని సినిమాలు ఇచ్చిన ఈ కల్ట్ మేకర్స్ ఇప్పుడిలా ఫామ్ లో లేకుండా ఉండటం వాళ్ళను బాధిస్తోంది. రిటైర్ అయిపోతే ఏ సమస్యా లేదు కానీ ఇంకా తమను తాము ప్రూవ్ చేసుకోవడం కోసం కష్టపడుతున్నారు కనక దానికి తగ్గ ఫలితం దక్కాలనేది అభిమానుల ఆకాంక్ష. మరి నిజంగా కార్యరూపం దాలుస్తుందా లేక అలా ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టి మాయమైపోతుందానేది వేచి చూడాలి.
This post was last modified on August 28, 2026 11:25 am
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…