ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్న విశ్వంభర అక్టోబర్ లో వచ్చే అవకాశాలు దాదాపు సున్నా. ఇది తెలిసే మైత్రి సంస్థ రణబాలిని దసరా పండక్కు లాక్ చేసుకుంది. పోటీలో రజనీకాంత్ జైలర్ 2 ఉన్నా సరే వెనక్కు తగ్గనంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది. మరి విశ్వంభర ఎప్పుడనే ప్రశ్నకు సమాధానం దొరకాలి. అంతర్గత సమాచారం ప్రకారం అన్ని అనుకున్న టైంకు కనక పూర్తయితే డిసెంబర్ ఆప్షన్ వైపు యువి క్రియేషన్స్ సీరియస్ గా చూస్తోందట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
జనవరి 13 కాకా వస్తోంది. అంటే కేవలం నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ లో రెండు మెగాస్టార్ సినిమాలు రావడం ఇప్పుడున్న బాక్సాఫీస్ పరిస్థితిలో అంత సేఫ్ కాదు. కానీ వేరే ఆప్షన్ లేనప్పుడు తప్పదనిపించినా ఫ్యాన్స్ మాత్రం 2027 సమ్మర్ కు వెళ్లిపోవడం బెటరని ఫీలవుతున్నారు. ఒకప్పుడు అంటే నలభై సంవత్సరాల క్రితం చిరంజీవి యూత్ గా ఉన్న టైంలో నెలకో రిలీజు ఉండేవి. కృష్ణని ఫాలో అవుతూ యమబిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడా సిచువేషన్ ఏ హీరోకి లేదు.
అసలే డిసెంబర్ లో ఫౌజీ, బాలయ్య 111, కింగ్ 100, షారుఖ్ కింగ్ తో పాటు హాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ డూమ్స్ డే కాచుకుని ఉన్నాయి. వీటిలో ఏవి తప్పుకుంటాయో ఇంకా ఫైనల్ కాలేదు. విశ్వంభరని అదే నెలలో పంపాలనుకుంటే ఎక్కడ పోటీ ఉండదో చెక్ చేసుకుని చూడాలి, లేదంటే థియేటర్ల పంపకాల నుంచి రకరకాల విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. నవంబర్ అనువైన సీజన్ కాకపోవడంతో నిర్మాతలెవరూ ఆ మంత్ మీద ఆసక్తి చూపించడం లేదు.
రిలీజ్ సంగతి ఎలా ఉన్నా ముందైతే విశ్వంభర ఇప్పటికే జీరో అయిపోయిన హైప్ తిరిగి సృష్టించడం ఎలాగో ప్లాన్ చేసుకోవాలి. దానికి సరైన మార్గం ట్రైలర్. ఇంకా సిజి వర్క్స్ చేతికి రావాల్సి ఉందని వినికిడి. అవి వచ్చాక, చిరంజీవి మెచ్చుకున్నాక, ఇంక ముందుకు వెళ్లొచ్చు అని అభయం దొరికిన తర్వాత తప్ప అంతకన్నా ముందు ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. వసిష్ఠ దర్శకత్వం వహించిన విశ్వంభరకు కీరవాణితో పాటు భీమ్స్, గౌరా హరి సంగీతానికి పని చేశారు.
This post was last modified on August 27, 2026 2:54 pm
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…