Movie News

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయనకు మంచి సక్సెస్ రేట్ ఉంది కానీ.. ఆయన కూడా కొన్ని ఫెయిల్యూర్లను తప్పించుకోలేకపోయారు. ఐతే ‘ఖలేజా’ రిలీజైనపుడు దగ్గర డిజాస్టర్ అయినా.. తర్వాత టీవీల్లో ఆన్ లైన్లో గొప్ప ఆదరణ తెచ్చుకుని ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. కానీ ‘అజ్ఞాతవాసి’ మాత్రం అలా కాదు.

అది ఆయన కెరీర్లో అతి పెద్ద మరకగా నిలిచిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కావడమే కాదు.. తర్వాత డిజిటల్‌గా రిలీజయ్యాక కూడా పూర్తి నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా డిజాస్టర్ కావడం ఒకెత్తయితే.. ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని కాపీ కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం, ఆ సినిమా మేకర్స్‌కు నష్టపరిహారం కూడా కట్టాల్సి రావడం త్రివిక్రమ్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసింది.

‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడ్డానికి కూడా త్రివిక్రమ్ అంతగా ఇష్టపడరు. కానీ తాజాగా ఒక కార్యక్రమంలో ఈ సినిమా తాలూకు చేదు అనుభవం గురించి ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ చెప్పారు త్రివిక్రమ్. మన జీవితంలో ఏదైనా పెద్ద ప్రతికూల విషయం జరిగితే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదంటూ ‘అజ్ఞాతవాసి’ ఉదాహరణనే పంచుకున్నాడు మాటల మాంత్రికుడు.

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత తాను కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టానని.. కానీ ఆ సినిమా ఫెయిలవడంతో తాను మొత్తం రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చిందని.. దీంతో ఇంటి పని ఆగిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మాత కూడా లాభం మొత్తం వదులుకున్నారని.. పవన్ కళ్యాణ్ కూడా పారితోషకంలో కొంత వెనక్కి ఇచ్చారని ఆయన వెల్లడించారు.

ఐతే తనకు ఏదో కష్టం వచ్చింది కదా అని దాన్ని భార్యాపిల్లల దగ్గర దాచాలనుకోవట్లేదని.. అప్పుడు తన పిల్లలు చిన్నవాళ్లే అని.. అయినా వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పానని.. ఇకముందూ మనం అద్దె ఇంట్లోనే ఉంటామని చెప్పానని.. దాన్ని వాళ్లు తేలిగ్గానే తీసుకున్నారని త్రివిక్రమ్ చెప్పాడు. దీంతో తన మీద భారం తగ్గిపోయిందన్నాడు.

తాను దాచిపెట్టాలన్నా దాగే నిజం అది కాదని.. పిల్లలకు అది అర్థమైపోతుందని.. తాను లోలోన బాధ పడుతుంటే వాళ్లు అర్థం చేసుకుని మరింత బాధ పడతారని.. అందుకే ఆ ఇబ్బంది లేకుండా తానే అసలు విషయం చెప్పేయడంతో అందరం ప్రశాంతంగా ఉన్నామని త్రివిక్రమ్ వివరించాడు.

This post was last modified on August 25, 2026 10:46 pm

Share

Recent Posts

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

5 minutes ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

17 minutes ago

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

3 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

4 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

4 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

9 hours ago