Movie News

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి రూ.300 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం తన పేరు మార్మోగింది. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకడైపోయాడు ప్రశాంత్. తన నుంచి వరుసగా సినిమాలు అనౌన్స్ అయ్యాయి. రకరకాల కాంబినేషన్లలో సినిమాలు చేస్తాడని ప్రచారం జరిగింది.

కానీ రణ్వీర్ సింగ్‌తో అనుకున్న సినిమా ముందుకు కదలకపోవడం.. మోక్షజ్ఞతో అనౌన్స్ చేసిన ప్రాజెక్టూ ఆగిపోవడం.. మరోవైపు ‘జై హనుమాన్’ ఎంతకీ సెట్స్ మీదికి వెళ్లకపోవడంతో ఇదేం ప్లానింగ్ అంటూ ప్రశాంత్ మీద కౌంటర్లు పడ్డాయి. అతను స్క్రిప్టు అందించిన మహాకాళి, జాంబిరెడ్డి-2 సినిమాలు కూడా ఆలస్యం కావడంతో తన పట్ల ఒక రకమైన నెగెటివిటీ ముసురుకుంది. ఊరికే హడావుడి చేస్తాడు తప్ప సినిమాలు పట్టాలెక్కించడంటూ విమర్శలు మొదలయ్యాయి.

ఐతే కొంచెం లేటుగా, ఇప్పుడు ప్రశాంత్ ట్రాక్‌లో పడ్డట్లున్నాడు. కొన్ని రోజుల వ్యవధిలో తన రెండు సినిమాల అప్‌డేట్స్ బయటికి వచ్చాయి. ప్రశాంత్ స్క్రిప్టుతో రూపొందిన ‘జాంబిరెడ్డి-2’ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందనే వచ్చింది. మరోవైపు ప్రశాంత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తన ప్రశాాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి రిలీజ్ చేయబోతున్న ‘మహాకాళి’ కూడా టీజర్‌తో ఆకట్టుకుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయగల సినిమాలా కనిపిస్తోంది.

ఈ సినిమా కాన్సెప్ట్, కాస్టింగ్, వీఎఫెక్స్ అన్నీ వేరే లెవెల్ అనిపిస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హనుమాన్’ కూడా కొన్ని నెలల ముందే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. దాని షూటింగ్ కూడా చురుగ్గా సాగుతోంది. ఆ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. అందులో ప్రశాంత్ మరింతగా మెరుపులు మెరిపిస్తాడని అంచనా వేస్తున్నారు. ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ కానుండడం విశేషం. దీంతో 2027లో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

This post was last modified on August 25, 2026 11:02 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago