మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని డిజాస్టర్లు అయ్యాయి. కొన్ని చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ ఏదీ ఆయనకు ఆనందాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. ఐతే ఇన్నేళ్ల కరువు తీర్చేస్తూ మాస్ రాజా కొత్త సినిమా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. కేవలం రెండో రోజే బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ చిత్రం.. ఆదివారం కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఈ చిత్రం మీద పెట్టుబడి పెట్టిన అందరూ భారీ లాభాలు అందుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే అందరికంటే ఎక్కువ లాభం రవితేజకే అన్నది యూనిట్ వర్గాల సమాచారం. గత కొన్నేళ్లలో రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తినడంతో ఆయన పారితోషకం తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కొందరు హీరోలు అనుసరిస్తున్నట్లు లాభాల్లో వాటా తీసుకోవడం, ఏరియాల రైట్స్ తీసుకోవడం లాంటి మోడల్ వైపు కూడా ఆయన మళ్లాల్సి వచ్చింది.
ఇందులో భాగంగానే ‘ఇరుముడి’కి రవితేజ రిలీజ్ ముంగిట పారితోషకం అంటూ ఏమీ తీసుకోలేదు. కొంత మేర లాభాల్లో పర్సంటేజీ తీసుకోవడంతో పాటు నైజాం ఏరియా హక్కులను తీసుకున్నారు. రిలీజ్ ముంగిట ‘ఇరుముడి’ థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.7 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు చూస్తే ఆ మార్కును రెండో రోజే దాటేసింది ‘ఇరుముడి’. ఫుల్ రన్లో ఈ సినిమా నైజాంలో రూ.25 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబట్టేలా కనిపిస్తోంది.
మరోవైపు లాభాల్లో వాటా కింద కూడా రవితేజ మంచి మొత్తమే అందుకోబోతున్నారు. ఇలా మొత్తంగా ఆయనకు ‘ఇరుముడి’తో రూ.25 కోట్ల దాకా వర్కవుట్ కావచ్చని భావిస్తున్నారు. తన మార్కెట్ దెబ్బ తిన్న దృష్ట్యా పారితోషకం అడిగి ఉంటే రూ.15 కోట్లకు అటు ఇటుగా దక్కేదేమో. కానీ లాభాల్లో వాటా, ఏరియా హక్కులు తీసుకోవడం వల్ల ఊహించని స్థాయిలో ఆదాయం అందుకుంటున్నాడు మాస్ రాజా. ఈ మోడల్ చూసి మిగతా హీరోలు కూడా టెంప్ట్ కావచ్చు కానీ.. అన్నిసార్లూ ఇలాంటి మ్యాజిక్స్ జరగవు. ‘ఇరుముడి’ తీసిన మైత్రీ సంస్థే నిర్మించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు ఇదే మోడల్ అనుసరించిన రామ్ పోతినేని గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు.
This post was last modified on August 23, 2026 5:05 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…