ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా వర్తిస్తుంది. దృశ్యంతో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే సరికొత్త జానర్ పరిచయం చేసిన దర్శకుడు జీతూ జోసెఫ్ అలాంటి కథతో రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించారు. పదమూడు సంవత్సరాల క్రితం 2013లో మొదలైన ఈ ఫ్రాంచైజ్ తొలి భాగం బ్లాక్ బస్టర్ అయ్యాక ఇతర బాషల నుంచి వెంకటేష్, అజయ్ దేవగన్, కమల్ హాసన్, రవిచంద్రన్ లాంటి స్టార్లు ఏరికోరి రీమేక్ చేసుకున్నారు.
వీళ్ళందరూ మంచి హిట్లు అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత కరోనా టైంలో దృశ్యం 2 వచ్చింది. థియేటర్స్ లో వర్కౌట్ కాదని భావించి నేరుగా థియేటర్ రిలీజ్ చేశారు. వెంకటేష్ రీమేక్ కూడా అదే బాట పట్టింది. డిజిటల్ కాబట్టి హిట్టయ్యిందో ఫ్లాప్ అయ్యిందో గుర్తించే ఛాన్స్ లేకుండా పోయింది. వ్యూస్ అయితే మిలియన్లలో వచ్చి పడ్డాయి. ఈ సంవత్సరం దృశ్యం 3 వచ్చింది. వెంకటేష్ ఈసారి మూడో భాగం వద్దనుకున్నారు. దీంతో డబ్బింగ్ చేసి మోహన్ లాల్ నే చిట్టిబాటుగా చూపించేశారు.
కేరళలో దృశ్యం 3 ఆడింది కానీ మిగిలిన చోట్ల ఆడలేదు. కథను ఎలా సాగదీయాలో అర్థం కాక క్లైమాక్స్ ని ఖంగాళీ చేయడం చాలా మందికి నచ్చలేదు. పైగా చివరి అరగంట ట్విస్టుల కోసం రెండు గంటలు టీవీ సీరియల్ తరహాలో స్క్రీన్ ప్లే నడవడం ఇంకో మైనస్ అయ్యింది. రిలీజైన టైంలోనే దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ ఇకపై కొనసాగింపు ఉండదనే హింట్ ఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఒక ఈవెంట్ లో ఆయన తరఫున నిర్మాత ప్రకటన ఇచ్చేశారు.
ఏదో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి కథలంటే ఏమో అనుకోవచ్చు కానీ దృశ్యంని ఈ రకంగా ఇంకా లాగుతూ ఉండటం విచిత్రం. అక్టోబర్ లో విడుదల కానున్న అజయ్ దేవగన్ దృశ్యం 3కి వేరే కథ రాసుకున్నారట. మెయిన్ పాయింట్ దగ్గరగా ఉన్నప్పటికీ ట్రీట్ మెంట్, క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉంటాయట. అందుకే మోహన్ లాల్ వెర్షన్ ఓటిటిలో వచ్చినా దర్శక నిర్మాతలు టెన్షన్ పడటం లేదు. చూస్తుంటే దృశ్యం 4 ఇంకో ఏడాదిలో వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.
This post was last modified on August 23, 2026 6:02 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…