నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి రావడం ఆలస్యం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతంలో కూలి, కాంతార లాంటి వాటికి కూడా హైక్స్ ఇచ్చారు కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఏ మాత్రం తొందరపడినా దాని తాలూకు పరిణామాలు నేరుగా ఓపెనింగ్స్ మీద పడేలా ఉన్నాయి. టాక్సిక్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎందుకంటే పెద్ది తర్వాత అంటే జూన్ మూడో వారం నుంచి ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా బోలెడు సినిమాలు చూశారు. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, విశ్వనాథ్ అండ్ సన్స్, ఒడిస్సి,. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదలైనవన్నీ విజయవంతంగా మాములు ధరలకే నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి. ఆడియన్స్ కూడా ఇదేదో బాగుందని వాటికి బాగా అలవాటు పడ్డారు. ఇరుముడికి కూడా పెంపు అడగలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా టాక్సిక్ కనక పెంపు తీసుకుంటే రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాదు. తెలుగు వాళ్ళు తీయలేదు. తెలుగు హీరో నటించలేదు. టెక్నీషియన్స్ ఎవరూ తెలుగు వాళ్ళు కాదు. అంతెందుకు టాలీవుడ్ యాక్టర్స్ ఎవరున్నారు అంటే ఠక్కున సమాధానం దొరకదు. అలాంటప్పుడు స్పెషల్ ట్రీట్ మెంట్ ఎందుకు ఇవ్వాలనేది మూవీ లవర్స్ ప్రశ్న. జిఓ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఇంత చర్చ జరుగుతోంది.
ఈ విషయం గురించే కాదు టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ మీద కూడా జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హీరో యష్ అంత ఏముండవని, నేను ఎవరినీ ముద్దు కూడా పెట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ కియారా అద్వానీ, తారా సుతారియా పాటల్లో చూస్తేనేమో ఫుల్లుగా రొమాన్స్ ఉంది. ఇక్కడ లింక్ మిస్ అవుతోంది. ఏది ఏమైనా టికెట్ రేట్ల హైక్ తీసుకున్నా తీసుకోకపోయినా టాక్సిక్ మటుకు యునానిమస్ టాక్ తెచ్చుకుంటేనే మనదగ్గర వర్కౌట్ చేసుకోగలదు.
This post was last modified on August 19, 2026 4:45 pm
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…
నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…