ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అనంతపురం జిల్లా హిందుపూర్ ఎస్వి సినీ మ్యాక్స్ థియేటర్ సాయంత్రం షో హౌస్ ఫుల్ కావడం చూస్తే ఎవరైనా నోట మాట వస్తే ఒట్టనేలా ఉంది. అదొక్కటే కాదు మేజర్ సెంటర్స్ అన్నింటిలోనూ షోకి యాభై నుంచి నూటా యాభై వరకు ఆక్యుపెన్సీ నమోదయ్యిందని ట్రేడ్ టాక్. నిన్నటి గ్రాస్ నలభై లక్షల దాకా ఉందని రిపోర్ట్.
ఇది నిజంగానే అనితరసాధ్యమైన ఫీట్. ఎందుకంటే డిజిటల్ లోకి వచ్చాక జనాలు ఇంట్లో చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉన్నా లేకపోయినా ఒరిజినల్ ప్రింట్ చూసేందుకు రకరకాల మార్గాలు ఉంటాయి. కొందరు మొన్న వినాయక చవితి కి ఏకంగా వీధుల్లో తెరలు కట్టి మరీ ఇరుముడి షోలు వేశారు. ఇది లీగల్ కాకపోయినా నిర్మాతలు ఈ రెస్పాన్స్ చూసి సంతోషంతో లైట్ తీసుకున్నారు. ఇలా ఒకటి రెండు కాదు పదుల చోట్ల ఈ తరహా సన్నివేశాలు కనిపించాయి.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్యారడైజ్ ఒకపక్క దూకుడు చూపిస్తున్న టైంలో కూడా ఆడియన్స్ ని తనవైపు తిప్పుకోవడం ఇరుముడికి మాత్రమే సాధ్యమైన ఫీట్. 39 రోజులు అవుతున్నా ఇంకా చాలా చోట్ల తీసేయడానికి ఎగ్జిబిటర్లు ఇష్టపడటం లేదు. యాభై రోజులు ఖచ్చితంగా ఆడించి తీరతామని కొందరు ఫిక్స్ అయిపోగా దసరా రిలీజులు ఉన్న నేపథ్యంలో ఎక్కువ సెంటర్స్ లో సాధ్యం కాకపోవచ్చు. ఇది కొంచెం ఇబ్బంది కలిగించేదే.
రవితేజ మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి విజయం చూస్తాడో లేదో చెప్పలేం కానీ ఇలాంటి బడ్జెట్ లో టాలీవుడ్ సైతం ఈ టైపు సక్సెస్ చూడటం అయితే ఈజీ కాదు. ఎందుకంటే అయ్యప్పస్వామి ఎలిమెంట్, కూతురి సెంటిమెంట్, మల్లెపూల పల్లకి పాట వెరసి ఇరుముడికి రిపీట్ జనాలు వచ్చేలా చేశాయి. ఓటిటి ట్రెండింగ్ లో ఆల్రెడీ దూసుకుపోతున్న ఈ జనరేషనల్ బ్లాక్ బస్టర్ నిజంగానే ఆ ట్యాగ్ కి పూర్తి న్యాయం చేకూర్చింది. యాభై రోజులకు ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో.
This post was last modified on September 28, 2026 10:18 pm
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
గత వారాంతంలో నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’ గురించి సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగిందో.. తమిళ…