Political News

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేసీఆర్ నేతృత్వంలోని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తనను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిందని, అక్రమ కేసులు బనాయించి అనేక సార్లు జైలుకు పంపించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అయినా నేను వెనకంజ వేయలేదని, మరింత కసిగా ప్రజల్లోకి వెళ్లి పని చేశానని చెప్పారు.

ఢిల్లీలో నిర్వహించిన కాన్ క్లెవ్ -2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండియాస్ నెక్ట్ చాప్టర్ అనే అంశం మీద మాట్లాడారు. తెలంగాణా అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లి ఉంటానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీ చేసిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరడం, అక్కడ నుంచి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం వరకు పలు విషయాలపై అనర్గళంగా మాట్లాడారు. అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

నేను ఎక్కడ ఉన్నా దేశం, రాష్ట్రం కోసం పనిచేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానంటూ సీఎం స్పష్టం చేశారు. తెలంగాణా ఏర్పాటు తర్వాత టీడీపీ బలహీనపడటంతో కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. రాహుల్ గాంధీ నిఖాసర్సయిన నాయకుడని, ఆయనకు సొంత ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాలు లేవని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశానికి మేలు జరుగుతుందని తెలిపారు.

ఏబీవీపీలో గెలిచిన విద్యార్థి నేతలు ఆ తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారని, కనుక తెలంగాణాలో బీజేపీ ప్రభావం లేదని విశ్లేషించారు. తెలంగాణాలో ఎన్ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదన్న ఆయన లెఫ్ట్, రైట్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటుందని, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయమంతా రేవంత్ రెడ్డి, కేసీర్ మధ్య జరుగుతుందని హింట్ ఇచ్చారు.

This post was last modified on September 29, 2026 7:26 am

Share

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

11 minutes ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

3 hours ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

6 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

9 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

10 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

13 hours ago