Movie News

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా పరిస్థితి మారిపోయింది. హాఫ్ సెంచరీ అంటే కలలో మాటే. ఏదో అల్లరి నరేష్ లాంటి వాళ్ళు తొలినాళ్లలో వేగంగా చేయబట్టి సరిపోయింది కానీ లేదంటే తన పరిస్థితి కూడా భిన్నంగా ఉండేది కాదు. అయితే సీనియర్లు మాత్రం దశాబ్దాలు గడిచినా మేం వయసుకు వచ్చాము తరహాలో పాట పాడుకుంటూ సరికొత్త స్ఫూర్తిని యువతరానికి ఇస్తున్నారు.

చిరంజీవినే తీసుకుంటే సినిమాల విషయంలో భోళా శంకర్ తర్వాత కొంచెం స్పీడ్ తగ్గించినట్టు అనిపించినా మన శంకరవరప్రసాద్ గారుతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. కాకా స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్య పోతున్నాయి. విశ్వంభర ఆలస్యానికి ఆయన కారణం కాదు కాబట్టి పాయింటవుట్ చేయలేం. తర్వాత బుచ్చిబాబుకి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది. ఇక్కడితో ఆగిపోతే మనం ఇంత ప్రత్యేకంగా ఇంత డీటెయిల్స్ తో చెప్పాల్సిన అవసరం లేదు.

అసలు విషయానికి వద్దాం. సినిమాలు కాకుండా చిరంజీవి రెండు విషయాల్లో సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతున్నారు. మొదటిది హైదరాబాద్ లో తలపెట్టిన మల్టీప్లెక్స్ వ్యాపారం. ఆల్రెడీ తాళ్ళూరి థియేటర్లను ఆధునీకరించే పనిలో ఉండగా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ ని పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటిదాకా ఈ బిజినెస్ లో తమ ముద్ర వేసిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ, వెంకటేష్ లకు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు.

ఇదలా ఉంచితే నెట్ ఫ్లిక్స్ కోసం త్వరలో చిరంజీవి ఒక టాక్ షో చేయబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. గ్లోబల్ ఆడియన్స్ ని చేరుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. సినిమాల్లోనే బిజీ ఉన్నప్పటికీ ఇలా ఇతర వ్యాపకాల గురించి ఆలోచించడం చూస్తుంటే నలభై వయసుకే అంతా అయిపోయిదనుకునే జెన్ జీ బ్యాచ్ ఈ సీనియర్ల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. చిరునే కాదు బాలయ్య, నాగార్జున, వెంకటేష్ సైతం ఇదే ఉత్సాహంతో పరుగులు పెడుతున్నారు.

This post was last modified on September 28, 2026 11:46 pm

Share

Recent Posts

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

5 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

6 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

8 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

10 hours ago

పాపం అల్లు శిరీష్.. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…

10 hours ago

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

11 hours ago