Movie News

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ 40కి పైగా దేశాల్లో ట్రెండింగ్ లో ఉండటం విశేషమే. రెండు వారాలు దాటిపోయినా కూడా ఇంకా కొనసాగుతోంది. నెగటివ్ రివ్యూలు రాకపోవడం, చూసినవాళ్ళ నుంచి అధిక శాతం ప్రశంసలు దక్కడం లాంటి కారణాల వల్ల భారీ హిట్ దిశగా దూసుకుపోతోంది. అంతగా ఇందులో ఏముందో చూద్దాం.

1999 కార్గిల్ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ బయట ప్రపంచానికి తెలియని ఒక కోణాన్ని చూపించే ఉద్దేశంతో దర్శకుడు ఓని సేన్ దీన్ని రాసుకున్నారు. అప్పటి ప్రధాని వాజ్ పేయ్ పాకిస్థాన్ పీఎం ముషారఫ్ తో చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో ప్రాంతాల్లో ఉన్న మన స్థావరాల మీద శత్రుదేశం సైనికులు దాడి చేస్తారు. చాలా కష్టమైన ఈ దశని దాటేందుకు ది గోల్డెన్ యురోస్ టీమ్ సిద్ధమవుతుంది. మన సైన్యం వాళ్లకు ఎలా బుద్ది చెప్పారనేది స్టోరీ.

లైన్ పరంగా చదివితే మాములుగా అనిపిస్తుంది కానీ ఆపరేషన్ సఫేద్ సాగర్ తెరమీద మాత్రం చాలా గ్రాండియర్ లుక్, క్వాలిటీ విజువల్స్ తో తెరకెక్కింది. వాయుసేన చేసే విన్యాసాలు, యుద్ధానికి ముందు వేసుకునే ఎత్తుగడలు, అనుకోకుండా ఏదైనా ముప్పు వస్తే దాన్ని ఎదుర్కునే విధానాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు ఓని సేన్. ఆరు ఎపిసోడ్లలో సిద్దార్థ్ నిడివి పరిమితంగా ఉన్నా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. జిమ్మీ షెర్గిల్, ఆదిల్ హుసేన్ తదితరుల పెర్ఫార్మన్స్ కట్టిపడేస్తుంది.

తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ఇంకొంత కాలం టాప్ లోనే ఉండేలా ఉంది. దీని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ ది లాస్ట్ సెల్యూట్ పేరుతో డాక్యుమెంటరీ విడుదల చేయనుంది. ఆరు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఫైటర్ జెట్ల బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందింది. గ్లోబల్ 2 పొజిషన్ లో కొనసాగుతున్న ఆపరేషన్ సఫేద్ సాగర్ కు ఇంకాస్త మెరుగైన ప్రమోషన్స్, పబ్లిసిటీ చేసి ఉంటే రీచ్ ఇంకా భారీగా పెరిగి జెన్ జీ కిడ్స్ చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళు. 

This post was last modified on August 19, 2026 4:52 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

48 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

1 hour ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago