సందీప్ కిషన్.. హిట్లు ఫ్లాపుల కంటే ముందుగా గుర్తొచ్చేది ఈ హీరో చేసే ప్రయోగాలు. 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఒకే ఫార్మాట్ ఇమేజ్ లేదు. ఒకసారి కామెడీ చేస్తే మరోసారి యాక్షన్ మూవీతో వస్తాడు. ఇంకోసారి థ్రిల్లర్, హారర్ ఫాంటసీ.. ఇలా రకరకాల కథలు ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు సిగ్మా సినిమాతో హీస్ట్ యాక్షన్ అడ్వెంచర్ చేస్తున్నాడు. ఒక హీరో ఇన్ని జానర్స్ కవర్ చేయడం మంచి విషయమే.
సందీప్ ప్రస్థానంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత టైగర్, నగరం, మాయవన్, ఏ1 ఎక్స్ ప్రెస్, మైఖేల్, ఆమధ్య వచ్చిన ఊరు పేరు భైరవకోన.. ఇలా ప్రతి సినిమాకు తన జానర్ మార్చుకుంటూనే ఉన్నాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డాయి, కొన్ని పోయాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక రెగ్యులర్ సేఫ్ ఫార్ములాను సెట్ చేసుకోకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ ఫ్లెక్సిబిలిటీ డైరెక్టర్లకు బాగా ప్లస్ అవుతోంది. సందీప్ ను హీరోగా అనుకోగానే ఇమేజ్ కోసం కథలో మార్పులు చేయాల్సిన అవసరం రాదు. రిస్క్ ఉన్న కాన్సెప్ట్ కు కూడా వెంటనే ఓకే చెబుతాడనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అందుకే అతని దగ్గరకు ఎప్పుడూ కొత్త కథలు వెళ్తుంటాయి. కానీ ప్రేక్షకుల యాంగిల్ లో చూస్తే మాత్రం ఇంకోలా ఉంటుంది. నాని సినిమా అంటే కచ్చితంగా మంచి కథ ఉంటుందనే నమ్మకం ఉంది, విశ్వక్ సేన్ కు ఒక మాస్ యూత్ ఫాలోయింగ్ ఉంది.
సందీప్ దగ్గరకు వచ్చేసరికి అతని పేరుతో పాటు ఆ సినిమా కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పుడు సందీప్ లైనప్ లో ఉన్న సిగ్మా కూడా అలాంటి ఒక కొత్త ప్రయోగమే. స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతోంది.
జేసన్ తన తొలి ప్రాజెక్ట్ కోసం సందీప్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా కథకు తగ్గట్టుగా అతను మారే విధానమే అని తెలుస్తోంది. సందీప్ కు ఇండస్ట్రీలో అవకాశాలు లేవని, కొత్తగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎవరూ అనరు. ఎందుకంటే చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉంటాయి. కానీ ఆ సినిమా కంటెంట్ తో పనిలేకుండా.. సందీప్ సినిమా వస్తుంది కదా చూద్దాం అనే స్థాయికి రీచ్ అవ్వాల్సి ఉంది. మరి సిగ్మా ఆ లోటును తీరుస్తుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates