వెంకీ అట్లూరి.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియా అంతటా చర్చనీయాంశం అవుతున్న పేరు. సార్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరుసగా ఘనవిజయాలే కాదు, గొప్ప ప్రశంసలు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా ‘లక్కీ భాస్కర్’ దర్శకుడిగా వెంకీని ఎన్నో మెట్లు ఎక్కించగా.. ఇప్పడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యామిలీ మూవీతో వసూళ్ల మోత మోగించడం తన రేంజిని మరింత పెంచింది.
ఇప్పుడు తెలుగులో పెద్ద పెద్ద హీరోలు కూడా తనతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే తన తర్వాతి సినిమా ఎవరితో అన్నది వెంకీ ఇంకా తేల్చలేదు. ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ అంటున్నాడు కానీ.. అది ఇప్పుడే కాదని కూడా చెబుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో వెంకీ మరో ఆసక్తికర విషయం పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో తాను ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు అతను వెల్లడించాడు.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇప్పటికే తన వద్దకు వచ్చిందని, కానీ అందుకు టైం పడుతుందని అతను చెప్పాడు. చిరంజీవి తన చిన్ననాటి ఆరాధ్య కథానాయకుడని.. అలాంటి హీరోతో సినిమా అంటే చిన్న విషయం కాదని అతనన్నాడు. ఆ సినిమా ఆషామాషీగా చేయలేమని, ఆయన స్థాయికి తగ్గట్లు గొప్ప కథతోనే సినిమా చేయాలని.. అందుకు సమయం పడుతుందని అన్నాడు. చిరుతో సినిమా చేయాలంటే తనకు కూడా మరింత పరిణతి రావాలని.. కాబట్టి ప్రతి విషయం పకడ్బందీగా ఉండేలా చూసుకుని.. సరైన సమయంలో చిరుతో సినిమా చేస్తానని వెంకీ తెలిపాడు.
ఇక తాను వరుసగా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే సినిమాలు చేయడం గురించి వెంకీ మాట్లాడుతూ.. ‘రంగ్ దె’ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా సరే నిర్మాత నాగవంశీ తనను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చాడని, ఆ కృతజ్ఞతతోనే ఇప్పడు ఆయన బేనర్లో వరుసగా సినిమాలు చేస్తున్నానని.. ఇక ముందూ ఆయనతో ప్రయాణం కొనసాగుతుందని వెంకీ తెలిపాడు.
This post was last modified on August 18, 2026 1:09 pm
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…