Movie News

ఇండియాలో మరో హాలీవుడ్ దెయ్యం

ఈమధ్య హాలీవుడ్ హారర్ సినిమాలకు కూడా మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. పెద్దగా స్టార్ కాస్ట్ లేని ‘అబ్సెషన్’ సినిమా మన దగ్గర ఏకంగా 100 కోట్ల నెట్ వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. పోయిన నెలలో వచ్చిన ‘ఈవిల్ డెడ్ బర్న్’ కూడా ఫస్ట్ వీక్‌లోనే 25 కోట్ల గ్రాస్ కొట్టేసింది. ఈ దెయ్యాల ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ‘ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్’ ఆగస్టు 21న థియేటర్లలోకి వస్తోంది. పైగా ఈసారి మొదటి రోజే తెలుగు వెర్షన్ కూడా దించుతున్నారు.

ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు అమెరికాలో రిలీజై, అక్కడ హిట్ అయ్యాక మన దగ్గరకు వచ్చేవి. కానీ ఇన్సిడియస్ కు ఆ పరిస్థితి లేదు. అమెరికాతో పాటే మన దగ్గర కూడా ఆగస్టు 21నే విడుదల చేస్తున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ఇలాంటి సినిమాలకు హైదరాబాద్ లో ఇంగ్లీష్ షోలు వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది, సోనీ సంస్థ ఏకంగా తెలుగు ట్రైలర్ కట్ చేసి మరీ ప్రమోషన్స్ చేస్తోంది.

హారర్ లవర్స్ కు ‘ఇన్సిడియస్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2010లో మొదలైన ఈ సిరీస్‌లో ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా 740 మిలియన్ డాలర్ల పైనే కలెక్ట్ చేశాయి. 2023లో ‘ది రెడ్ డోర్’ తర్వాత వస్తున్న ఈ ఆరో పార్ట్ లో పాత లాంబర్ట్ ఫ్యామిలీని పక్కనపెట్టి ఓ కొత్త కుటుంబాన్ని తీసుకొచ్చారు. జెమ్మా అనే తల్లి ‘ది ఫర్దర్’ అనే దెయ్యాల ప్రపంచంలోకి వెళ్లడం, అక్కడి ఆత్మలను మన ప్రపంచంలోకి తీసుకురావడం ఈ కొత్త కథలో మెయిన్ పాయింట్.

బాక్సాఫీస్ దగ్గర ‘అబ్సెషన్’ రిజల్ట్ చూశాక హారర్ జానర్ సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. ఇప్పుడు వస్తున్న ‘ఇన్సిడియస్’కు ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ బాగా ప్లస్ అవుతుంది. జేకబ్ చేజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమీలియా ఈవ్ లీడ్ రోల్ చేయగా, ఎలిస్ క్యారెక్టర్ లో లిన్ షే మళ్లీ భయపెట్టబోతోంది. అయితే ఇది ఆరో పార్ట్ కావడంతో పాత సినిమాలు చూడని వాళ్లు కనెక్ట్ అవుతారా అనే చిన్న డౌట్ ఉంది. కానీ కొత్త ఫ్యామిలీ చుట్టూ కథ రాసుకున్నారు కాబట్టి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు.

This post was last modified on August 18, 2026 12:41 pm

Share

Recent Posts

లిటిల్ హార్ట్స్ మౌళికి టీవీ ఛానెల్ బ్లాక్‌మెయిల్

యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…

31 minutes ago

ప్రేక్షకులను ఎక్కువ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు

ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…

34 minutes ago

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే

ఏపీలో సుమారు 12 కార్పొరేష‌న్ల స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. వీటిలో రెండేరెండు కార్పొరేష‌న్లకు సంబంధించిన చ‌ర్చ జోరుగా సాగుతోంది.…

1 hour ago

గాజు గ్లాసుకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ…

3 hours ago

‘దొంగ నా కొడుకు’ వద్దంటే… ‘నా కొడుకు దొంగ’

ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు…

3 hours ago

జిల్లాల పోరు జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చేనా?

మునిసిప‌ల్‌, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ వైసీపీ నేత‌ల హ‌డావుడి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత…

4 hours ago