‘ఫౌజీ’ సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్ గా జనాల్లోకి వదిలే ఉద్దేశం వాళ్లకు అస్సలు లేదనిపిస్తోంది. ఎక్కడ చూసినా రక్తం, మంటలు, యుద్ధం మిగిల్చిన భయానక వాతావరణం కనిపిస్తోంది. ప్రభాస్ ఫేస్ రివీల్ చేసిన పోస్టర్ లో కూడా రెగ్యులర్ హీరోయిజం కంటే బాగా అలసిపోయిన సైనికుడి మూడ్ ఎక్కువగా హైలైట్ అయింది. ఇండిపెండెన్స్ డేకి వదిలిన పోస్టర్ కూడా కథలో హింస ఏ రేంజ్ లో ఉండబోతోందో చిన్న హింట్ ఇచ్చేసింది.
హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ పోస్టర్స్ ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ‘సీతారామం’లో స్వచ్ఛమైన ప్రేమకథను చూపించిన ఈ డైరెక్టర్, ఇప్పుడు ప్రభాస్ ను మాత్రం రక్తం అంటిన ప్రపంచంలోకి దించాడు. మొదటి లుక్ నుంచే బ్రిటిష్ కాలం, తిరుగుబాటు, సైనికుడి ప్రయాణం అనే హింట్స్ ఇస్తున్నారు. కానీ అసలు కథేంటో బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అసలైతే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా మొదలైనప్పుడు స్టైలిష్ షాట్స్ తో ఎలివేషన్ పోస్టర్లు వస్తుంటాయి. కానీ ఫౌజీ విషయంలో అలా జరగలేదు. ఇప్పటిదాకా వదిలిన ప్రతి పోస్టర్ లోనూ ప్రభాస్ కు ఒక రఫ్ టచ్ ఇచ్చారు. పోస్టర్లకే ఇలా రచ్చ చేస్తుంటే రేపు రాబోయే టీజర్ లేదా గ్లింప్స్ లో యుద్ధ సన్నివేశాలు ఇంకే స్థాయిలో ఉంటాయో చూడాలి.
భారీ యాక్షన్ మాత్రమే కాకుండా ప్రభాస్ క్యారెక్టర్ లోని ఎమోషనల్ సైడ్ ను హను ఎలా తీశాడనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఊరికే యాక్షన్ పెడితే ఇది ఇంకో వార్ ఫిల్మ్ లా మిగిలిపోయే ప్రమాదం ఉంది. పోస్టర్లలో కనిపిస్తున్న ఆ పెయిన్ కు కథలో బలమైన కారణం ఉంటేనే సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ఈ ప్రమోషన్ పోస్టర్స్ లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కడా రొమాన్స్ ప్రస్తావన తీసుకురాలేదు.
హను సినిమాల్లో హీరోయిన్ కు, ప్రేమకథకు మంచి స్పేస్ ఉంటుంది. కానీ ఫౌజీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు తిరుగుబాటు, రక్తం, సైనికుడు అనే పాయింట్ల మీదే ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ రాబోయే వీడియోల్లోనైనా హీరోయిన్ ట్రాక్ చూపిస్తారా లేక ఇదే ఇంటెన్స్ మూడ్ కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. ఫౌజీ సినిమా 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు ఇంకా మూడు నెలలకు పైగానే టైమ్ ఉంది. అంటే టీజర్, ట్రైలర్, పాటలతో అసలైన ప్రచారం అంతా ఇంకా ముందుంది. జస్ట్ పోస్టర్లతోనే ఫౌజీ ప్రపంచం ఇంత బ్రూటల్ గా కనిపిస్తుంటే, రేపు కదిలే విజువల్స్ లో ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates