ఇండియాలో ప్రతి ఫిలిం ఇండస్ట్రీలోనూ వారసత్వ హీరోల ఆధిపత్యమే కనిపిస్తుంది. తెలుగులో అది మరీ ఎక్కువ. ఇక్కడ ఇప్పటికే బోలెడంత మంది వారసులున్నారు. పేరున్న కుటుంబాల నుంచి ఇంకా ఇంకా కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి జైకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా తన ఇద్దరు కొడుకులను హీరోలను చేయాలనుకుంటున్నాడు.
ముందుగా పెద్ద కొడుకు హితేష్ అరంగేట్రం కోసం కొంత కాలంగా బండ్ల కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా తన డెబ్యూ మూవీ కోసం బండ్ల రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఒక పెద్ద దర్శకుడినే బండ్ల ఖాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన బండ్ల కథ రెడీ చేయించే పనిలో పడ్డాడట.
హితేష్‌ను ఇటీవలే తన కూతురి పెళ్లి వేడుకలో అందరికీ పరిచయం చేశాడు బండ్ల. సంగీత్ ఈవెంట్లో టెంపర్, చిరుత సినిమాల్లో పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు హితేష్. ఒడ్డూ పొడవూ కూడా బాగుండడంతో అతను హీరోగా రాణించగలడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఉత్సాహంలోనే బండ్ల తన కొడుకు అరంగేట్ర చిత్రానికి సన్నాహాలు వేగవంతం చేశాడు. గతంలో బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేసేటపుడు ఎలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడో తెలిసిందే. వి.వి.వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పెద్ద బడ్జెట్లో సినిమా తీశాడు. బండ్ల కూడా అదే బాటలో సాగుతున్నట్లు కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates