పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్కల ప్రకారం అయితే ఈపాటికి రీఎంట్రీలో ఆయన రెండు సినిమాలు పూర్తి చేసి ఉండాలి. అవి విడుదల కూడా అయిపోయుండాలి. కానీ ఇంకా పునరాగమనంలో తొలి సినిమా ‘వకీల్ సాబ్’ కూడా విడుదల కాలేదు. కరోనా కారణంగా ఆయన ప్రణాళికలన్నీ దెబ్బ తినగా.. ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’ను ముగించాడు. దీని తర్వాత మామూలుగా అయితే క్రిష్ సినిమా మొదలు కావాలి. కానీ మధ్యలో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ వచ్చి పడింది.
పవన్ ఆ సినిమాను ముందుకు తీసుకొస్తున్నాడని.. క్రిష్ సినిమా ఆలస్యం కాబోతోందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ చిత్రంపై క్రిష్ కోరుకున్నంతగా పవన్ ఫోకస్ పెట్టట్లేదని.. మొదట్నుంచి ఈ సినిమాకు అరకొరగానే డేట్లిస్తున్నాడని.. సినిమాకు ఏదో ఒక అవాంతరం తప్పట్లేదని.. ఇలా రకరకాలుగా వార్తలొచ్చాయి.
ఈ మధ్యే క్రిష్ కరోనా బారిన కూడా పడటంతో ఈ చిత్రం ఎప్పటికి పున:ప్రారంభం అవుతుందో.. ఎప్పటికి పూర్తవుతుందో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ ట్విట్టర్లో అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇచ్చింది. సెట్ నుంచి ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు. కాకపోతే వాటిలో క్రిష్, ఎ.ఎం.రత్నం మాత్రమే కనిపించారు. పవన్ కనిపించలేదు.
ఈ సినిమాలో పవన్ స్పెషల్ లుక్‌లో కనిపించనున్న నేపథ్యంలో అది బయటికి రాకూడదన్న ఉద్దేశంతోనే ఆయన్ని చూపించి ఉండకపోవచ్చు. ఈ సినిమా విషయంలో పవన్ టెన్షన్ తీర్చేశాడు. షూటింగ్‌కు హాజరవుతున్నాడు. సినిమా తీయడంలో క్రిష్ స్పీడేంటో అందరికీ తెలిసిందే కాబట్టి.. ఇక శరవేగంగా సినిమా పూర్తయిపోతుందని, ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతుందని ఆశించవచ్చు. సీనియర్ సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం తొలిసారి పవన్‌తో జట్టు కట్టడం విశేషం.
This post was last modified on January 12, 2021 10:12 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…