వచ్చే వారం విడుదలవుతున్న సినిమాల్లో విశ్వనాథ్ అండ్ సన్సే పెద్దది. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ తీసింది సితార ఎంటర్ టైన్మెంట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ కావడంతో ఏపీ తెలంగాణలోనూ మంచి రిలీజ్ దక్కనుంది. అందులోనూ వీరభద్రుడు మన దగ్గర కూడా కమర్షియల్ గా సక్సెస్ కావడం బిజినెస్ పరంగా ప్లస్ అవుతోంది. అయితే అంత పెద్ద హిట్టు తర్వాత వస్తున్న మూవీకి మార్కెట్, రిటర్న్స్ పరంగా ఒత్తిడి ఉంటుందానే డౌట్ ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది.
టాలీవుడ్ సంగతి కాసేపు పక్కనపెడితే సూర్యకు వీరభద్రుడు అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం కమర్షియల్ ఎలిమెంట్సే. కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే కంటెంట్ రాసుకున్నాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. ముఖ్యంగా కాంతార స్టైల్ లో డిజైన్ చేసుకున్న క్లైమాక్స్ పెద్ద ప్లస్ అయ్యింది. అందుకే మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇదే ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ కు ప్రెజర్ పాయింట్ కానుంది.
వెంకీ అట్లూరి తీసింది పూర్తిగా ఫ్యామిలీ అండ్ ఫన్ రొమాంటిక్ మూవీ. అందులోనూ ఒక పాతికేళ్ల యువతి అప్పటికే ఒక కొడుకు ఉన్న నలభై ఏళ్ళ వ్యక్తిని ప్రేమించడమనే సున్నితమైన పాయింట్ తీసుకున్నారు. ఇలాంటివి మాస్ కు అంత ఈజీగా ఎక్కవు. 35 సంవత్సరాల క్రితం యష్ చోప్రా హిందీలో ఇలాంటి ప్రయోగం అనిల్ కపూర్ – శ్రీదేవి జంటగా లమ్హే రూపంలో చేశారు కానీ పనవ్వలేదు. అప్పటికి ఇప్పటికీ జనాల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి కాబట్టి అట్లూరి రిస్క్ చేసి ఉండొచ్చు.
ఈ ఒత్తిడి గురించి వెంకీ అట్లూరి తనకెదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ గత సినిమా ఇన్ని వందల కోట్లు వసూలు చేసింది కాబట్టి మనది కూడా అంతకన్నా ఎక్కువ రావాలనే టార్గెట్ పెట్టుకుని పని చేస్తే ఫలితం దక్కదని, ఒకవేళ ఫ్యాన్స్ కోరుకున్నట్టు రికార్డులు దక్కితే సంతోషమే కానీ వాటి కోసమే పాకులాడటం సరికాదని అన్నారు. పైగా వీరభద్రుడు మాస్ ఫిలిం అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ క్లాస్ మూవీ అని, కాబట్టి అసలు పోల్చుకోవడమే కరెక్ట్ కాదని మ్యాటర్ తేల్చేశారు.
This post was last modified on August 9, 2026 8:01 pm
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…