Movie News

ఫేక్ క‌లెక్ష‌న్ల గురించి ఐటీ వాళ్ల‌కూ తెలుస‌ట‌

ఈ రోజుల్లో పోస్ట‌ర్ల మీద వేసే క‌లెక్ష‌న్ల లెక్క‌ల్ని ఎవ్వ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. అందుక్కార‌ణం.. ఒరిజిన‌ల్ వ‌సూళ్ల‌కు, ఆ నంబ‌ర్ల‌కు మ‌ధ్య చాలా తేడా ఉండ‌డ‌మే. ఆ నంబ‌ర్లు నిజం కాద‌ని గ‌తంలో అనుమానం ఉండేది. ఇప్పుడు నిర్మాత‌లే స్వ‌యంగా ఆ విష‌యాన్ని అంగీక‌రిస్తున్నారు. క‌లెక్ష‌న్ల పోస్ట‌ర్ల గురించి విలేక‌రులు ప్రెస్ మీట్ల‌లో లేదా ఇంట‌ర్వ్యూల్లో నిర్మాత‌ల్ని అడిగితే.. నిజం మీకు తెలియ‌దా అని ఎదురు ప్ర‌శ్న వేస్తున్నారు.

అభిమానుల‌ను సంతోష‌పెట్ట‌డానికే ఈ ప్రాక్టీస్ న‌డుస్తున్న‌ట్లు చెబుతారు. దిల్ రాజు, నాగ‌వంశీ.. ఇలా ప‌లువురు నిర్మాత‌లు ఈ మాట ఓపెన్‌గా అంటున్నారు. తాము ప్ర‌క‌టించే క‌లెక్ష‌న్లు నిజం కాద‌ని అంటూనే.. ఆ ప్రాక్టీస్‌ను కొన‌సాగిస్తున్నారు. ఇటీవ‌ల లెనిన్ మూవీకి నాగ‌వంశీ ఏం చేశాడో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయిన మాట వాస్త‌వ‌మే అయినా.. ఒరిజిన‌ల్ కలెక్ష‌న్ల‌ను చాలా పెంచి పోస్ట‌ర్ల మీద నంబ‌ర్స్ వేశార‌న్న‌ది స్ప‌ష్టం.

ఈ నేప‌థ్యంలో నాగ‌వంశీ తాజాగా మ‌రోసారి ఫేక్ క‌లెక్ష‌న్ పోస్ట‌ర్ల గురించి స్పందించాడు. ఈ ప్రాక్టీస్‌ను స‌మ‌ర్థించుకున్నాడు. తాము వంద రూపాయ‌ల క‌లెక్ష‌న్ వ‌స్తే 110-120 అని మాత్ర‌మే చెబుతున్నాం త‌ప్ప‌.. 200 అన‌ట్లేదు క‌దా అని ఆయ‌న అన్నాడు. అభిమానుల‌ను సంతోష‌పెట్ట‌డానికి ఇలా క‌లెక్ష‌న్ల‌ను పెంచి చూపించ‌డం మామూలే అని, ఇందులో త‌ప్పేముంద‌ని అడిగాడు.

మ‌రి ఇలా పోస్ట‌ర్ల మీద భారీ నంబ‌ర్లు వేస్తే ఆదాయ‌పు పన్ను అధికారుల నుంచి స‌మ‌స్య ఉండ‌దా అని అడిగితే.. నాగ‌వంశీ దానికీ త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. పోస్ట‌ర్ల మీద వేసే నంబ‌ర్లు నిజం కాద‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఉండే ప్ర‌తి అధికారికీ తెలుస‌ని తేల్చేశాడు. ఈ నంబ‌ర్స్ విష‌యంలో వారికి ఫుల్ క్లారిటీ ఉంద‌ని.. ఏమైనా సందేహాలుంటే త‌మ‌కు కాల్ చేసి అడుగుతార‌ని, ఆ డేటాను తాము పంపిస్తామ‌ని, కాబ‌ట్టి వారితో త‌మ‌కు స‌మ‌స్యేమీ లేద‌ని నాగ‌వంశీ స్ప‌ష్టం చేశాడు.

This post was last modified on August 9, 2026 10:09 am

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

44 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

49 minutes ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

55 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

5 hours ago