Political News

ఆలీ రాజకీయాలు ఎందుకు వదిలేశాడు?

తెలుగు సినిమా నటులు రాజకీయాలు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చూడట్లేదు జనం. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. ఆ ప్రభావం వారి సినిమాల మీదా పడుతోంది. ఇలా కెరీర్‌ను దెబ్బ తీసుకున్న వాళ్లలో ఆలీ కూడా ఒకరు. ఆయన చాలా ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత తన మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ పెట్టిన జనసేనలోకి వస్తారని అనుకుంటే.. అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 

వైసీపీ గెలిచాక ఒక పదవిలో ఉన్న ఆయన.. ఆ పార్టీ ఓడిపోయాక రాజకీయాల నుంచి వైదొలిగారు. ఇకపై మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేదే లేదంటున్నారు. మరి రాజకీయా పట్ల ఎందుకు విముఖత పెంచుకున్నారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. ఆలీ సమాధానం చెప్పారు. తాను మొదట పనిచేసిన పార్టీ పట్ల తన అసంతృప్తిని బయటపెట్టుకున్నారు. రాజకీయాల వల్ల సినిమా కెరీర్ దెబ్బ తిన్న విషయాన్ని అంగీకరించారు.

‘‘నేనెప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. 1999లో ఒక పార్టీ వాళ్లు నన్ను తీసుకెళ్లి ఆ పార్టీ కండువా కప్పారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నాను. ఐతే నాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. కేవలం ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినపుడు నన్ను ఉపయోగించుకోవడం, తర్వాత వదిలేయడం.. ఇదే జరిగింది. మనల్ని వాళ్లు గుర్తించనపుడు, మనల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తున్నపుడు మన సమయాన్ని వాళ్ల కోసం ఎందుకు వేస్ట్ చేయడం అనిపించింది. సినిమాలను పక్కన పెట్టి, టైం పెట్టి ఇలా కష్టపడడం ఎందుకు అనిపించింది. అందుకే ఆ పార్టీ నుంచి పక్కకు వచ్చేశాను. 

తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్లాను. అక్కడా పని చేశాను. మళ్లీ అది కూడా వద్దనిపించింది. మనకు తిండి పెట్టింది, ఇంతవాడిని చేసింది సినిమా. రాజకీయాల కోసం సినిమాలను ఎందుకు వదులుకోవాలి. ఈ కెరీర్‌ను ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనిపించింది. అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా బయటికి వచ్చేశాను. ఇకపై మళ్లీ ఆ రంగంలోకి వెళ్లను’’ అని ఆలీ తేల్చి చెప్పాడు.

This post was last modified on August 8, 2026 3:55 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

5 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

35 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago