Movie News

తమన్ ఆ జోక్‌నే నిజం చేశాడే

టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు తమన్. తెలుగులో దాదాపుగా అందరు టాప్ స్టార్లతో అతను సినిమాలు చేశాడు. ఓవైపు భారీ చిత్రాలకు పని చేస్తూనే ఇంకోవైపు మిడ్ రేంజ్ చిత్రాల్లోనూ భాగమవుతుంటాడతను. ఐతే ఎంత పెద్ద రేంజిలో ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తమన్ ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటాడు. తనపై ఉన్న కాపీ ముద్రను అతను తొలగించుకోలేకపోతున్నాడు. 

వేరే మ్యూజిక్‌ను కాపీ కొడతాడనే కాదు.. తన ట్యూన్లను తనే రిపీట్ చేస్తుంటాడనే విమర్శ కూడా అతడిపై ఉంది. తమన్ కంపోజ్ చేసిన ఒకే రకమైన పాటలను పక్క పక్కన పెట్టి అతణ్ని ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఐతే తమన్ ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. ఐతే ఇటీవల ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమన్ మీద పేలిన జోక్ ఇప్పుడు నిజం అయిందనే చర్చ జరుగుతుండడం గమనార్హం.

తమన్ సంగీతం అందించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఈ శుక్రవారమే రిలీజైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్‌, తన సోదరి నిహారిక కొణిదెల, కమెడియన్ సత్యలతో కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు తమన్. ఆ సందర్భంగా నిహారిక తనపై ఒక జోక్ వేసింది. ‘ఓజీ’ కోసం కంపోజ్ చేసి మిగిలిపోయిన ట్యూన్లనే ‘కొరియన్ కనకరాజు’లో పెట్టేశారట అని అంటే.. తమన్ నవ్వి ఊరుకున్నాడు. ఐతే ఈ సినిమా రిలీజయ్యాక చూస్తే ఆ జోకే నిజం అనిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోకు కొరియన్ దయ్యం పట్టి కథ అక్కడికి షిఫ్ట్ అవ్వగానే ఒక రకమైన థీమ్‌లో బీజీఎం సాగుతుంది. ఆ థీమ్స్ అన్నీ కూడా ‘ఓజీ’కి చాలా దగ్గరగా ఉన్నాయి. దయ్యం ఆవహించి కొరియన్ డాన్ అవతారంలో వరుణ్ తేజ్ స్టైల్‌గా నడిచి వచ్చేటపుడు, కత్తి పట్టుకుని విధ్వంసం సృష్టించేటపుడు వినిపించే సౌండ్స్‌.. యాజిటీజ్ ‘ఓజీ’ స్కోర్ లాగే అనిపించాయి. సోషల్ మీడియాలో దీని గురించి బోలెడన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలో వినిపించిన జోక్‌ను తమన్ నిజం చేసేశాడంటూ తనను మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

This post was last modified on August 8, 2026 4:02 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

4 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

5 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

6 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

6 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

7 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

8 hours ago