ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర విషయంలో విపరీతమైన విమర్శలు వచ్చింది ‘పెద్ది’ సినిమాకే. ఇందులో జాన్వి కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్ర విషయంలో రిలీజ్ ముందే విమర్శలు మొదలయ్యాయి. రిలీజ్ తర్వాత అవి మరింత పెరిగాయి. తెలుగు ప్రేక్షకులకు ఇతర భాషల వాళ్లు కూడా తోడై ఈ పాత్రను చూపించిన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో సినిమా థియేటర్లలో ఉండగానే దర్శకుడు బుచ్చిబాబు జాన్వి మీద తీసిన కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అయినప్పటికీ విమర్శలేమీ ఆగిపోలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక.. ఓటీటీలో రిలీజైనపుడు కూడా జాన్వి పాత్ర విషయంలో కౌంటర్లు కొనసాగాయి. ఇతర ఇండస్ట్రీల వాళ్లకు ఇదొక ఆయుధంలా మారింది. అక్కడ కూడా హీరోయిన్లను అంత గొప్పగా ఏమీ ప్రెజెంట్ చేయకపోయినా సరే.. టాలీవుడ్లో మాత్రమే తప్పు జరుగుతున్నట్లుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు..తాజాగా తమిళ కథానాయిక అదితి బాలన్.. ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానాన్ని తప్పుబట్టింది.
తమిళంలో ‘అరువి’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అదితి.. తెలుగులో ‘సరిపోదా శనివారం’లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమా ప్రస్తావన తెచ్చింది. ఇటీవలే పెద్ది సినిమా చూశానని.. అందులో హీరోయిన్ జాన్వి పాత్రను సరిగా చూపించలేదని వ్యాఖ్యానించింది. ఆ పాత్రను రాసిన విధానమే బాగా లేదని.. అది కరెక్ట్ కాదని ఆమె అంది.
ఆ సినిమాలో ఆ పాత్ర చేసేదేమీ లేదని ఆమె పేర్కొంది. ఆ క్యారెక్టర్‌ను ఇంకా బాగా రాసి ఉండొచ్చని.. హీరోయిన్లను చూపించే పద్ధతి మారాలని అదితి వ్యాఖ్యానించింది. ఇలా ఓ పాత్ర గురించి విశ్లేషకులు, సామాన్య ప్రేక్షకులు కామెంట్ చేయడం మామూలే కానీ.. ఇండస్ట్రీలో భాగమైన ఒక నటి ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం అరుదే. కాకపోతే తెలుగు సినిమాల్లో మాత్రమే ఇలాంటివి ఉన్నట్లు కొందరు వ్యాఖ్యానించడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
This post was last modified on August 8, 2026 2:37 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…