ఆంధ్రా అందగాడు అని ఒక సినిమా. దశాబ్దంన్నర కిందట రిలీజైంది. ఐతే ఆ పేరుతో ఓ తెలుగు సినిమా ఉన్నట్లు.. అది రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. సుమన్ శెట్టి, కృష్ణభగవాన్ అందులో కీలక పాత్రలు పోషించారు. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్.. ఇప్పుడు రజనీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టి కోలీవుడ్ నంబర్ వన్ హీరోగా అవతరించిన విజయ్‌తో సినిమా తీయబోతున్నారు.
ఆ డైరెక్టర్ పేరు.. సుధ కొంగర. పేరు చూసి చెప్పేయొచ్చు.. ఈమె తెలుగమ్మాయి అని. ఆ సంగతి నిజమే. కాకపోతే సుధ సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంది.. ఒక స్థాయి అందుకుంది.. ఓ పెద్ద సినిమాతో తన పేరు మార్మోగేలా చేసింది కోలీవుడ్లోనే. మాధవన్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ఆమె రూపొందించిన ‘ఇరుదు సుట్రు’ అక్కడ సెన్సేషనల్ హిట్టయింది. దీన్ని తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేసి ఇక్కడా విజయాన్నందుకుంది.
ప్రస్తుతం సూర్య హీరోగా సుధ రూపొందించిన ‘ఆకాశమే నీ హద్దురా’ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేదేమో. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుధకు విజయ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందని.. తన తర్వాతి సినిమా అతడితోనే అని ఓ ప్రచారం సాగింది. కానీ దానిపై అధికారిక సమాచారం లేదు.
కానీ ఈ రోజు సుధ పరోక్షంగా విజయ్‌తో తన సినిమా ఉంటుందని చెప్పేసింది. తన కొత్త సినిమా ప్రకటన జూన్ 22న ఉంటుందంటూ ఆమె ఓ ట్వీట్ వేసింది. అది విజయ్ పుట్టిన రోజు. ఆ రోజు ప్రకటన అన్నదంటే విజయ్‌తో తన సినిమా ఉంటుందని సుధ చెప్పకనే చెప్పిందన్నమాట.
ఐతే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే సుధతో.. మసాలా టైపు సినిమాలు చేసే విజయ్ జట్టు కట్టడానికి రెడీ అవడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. మరి కెరీర్ బిగ్గెస్ట్ ఛాన్స్‌ను మన తెలుగుమ్మాయి ఏ మేర ఉపయోగించుకుని.. ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తుందో చూడాలి.
This post was last modified on May 5, 2020 3:49 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…