Movie News

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం అంతగా పట్టించుకునేవారు కాదేమో కానీ రవితేజ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో కావడంతో అంతో ఇంతో సోషల్ మీడియాలో సౌండ్ వినిపించింది. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాస్ మహారాజ స్వయంగా వచ్చి ఆశీర్వదించడంతో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మారెమ్మ ఫలితం అన్ని రకాలుగా నిరాశపరిచేలా వచ్చింది.

సరైన కథా కథనాలు రాసుకోకుండా, స్క్రిప్ట్ చెక్ చేసుకోకుండా, ఏదో గ్రామీణ నేపథ్యం పెట్టేశాం, డివోషనల్ టచ్ ఇచ్చేశాం, హీరోకి గెడ్డం పెట్టి మాస్ లుక్ రప్పించాం అని సంబరపడ్డారే కానీ నిజంగా ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోలేదు. పైగా హీరో మాధవ్ భూపతిరాజు యాక్టింగ్ కూడా ఇంకా ప్రాధమిక స్టేజిలోనే ఉండటం నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది. దీంతో వీకెండ్ కూడా క్యాష్ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో మారెమ్మ త్వరగా సెలవు తీసుకునేలా ఉంది.

మాధవ్ భూపతిరాజు స్వయంగా రవితేజ తమ్ముడు రఘు కొడుకు. పెదనాన్నగా తనకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చాడు కానీ అసలు విషయంలో బలం లేనప్పుడు మాస్ రాజా అయినా ఏం చేయగలడు. అందుకే తన వంతు మద్దతుని ఈవెంట్ రూపంలో ఇచ్చేసి సైలెంట్ అయ్యాడు తప్పించి లేనిపోని ఎలివేషన్లు, పొగడ్తలు సోషల్ మీడియాలో గుప్పించలేదు. కాకపోతే ఇకపైన మాధవ్ ఎంచుకునే కథలకు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తే బెటరేమో.

అయినా కొత్త హీరోలు ఎవరైనా డెబ్యూగా వీలైనంత సింపుల్ సబ్జెక్టులను ఎంచుకోవాలి తప్పించి ఏదో ట్రెండ్ ఉంది కదాని మారెమ్మ లాంటివి ట్రై చేస్తే ఇలా రివర్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పోటీ ఎక్కువగా ఉన్న టైంలో విడుదల చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఎపిక్ వీక్ అయినా, మహేంద్రగిరి వారాహికి మిక్స్ టాక్ ఉన్నా మారెమ్మ వాటికన్నా చాలా వెనుకబడిపోయింది. మొత్తం డామినేషన్ మండాడిదే అయిపోయాక ఎవరేం చేయగలరు.

This post was last modified on September 15, 2026 12:42 pm

Share

Recent Posts

బ్రిటిష్ పౌరసత్వం వచ్చినా… ఇక్కడ కేసులు పోవు లలిత్ మోదీ

ఒకప్పుడు భారత క్రికెట్‌లో లలిత్ మోదీ మాటకు ఎంతో విలువ ఉండేది. ఐపీఎల్‌ను ప్రారంభించి బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చేలా…

36 minutes ago

రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోలేదు కానీ..

లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ, సీనియర్ నటి రమ్యకృష్ణల వివాహ బంధం గురించి జనాలకు అనేక సందేహాలున్నాయి. వీళ్లిద్దరూ కలిసి జీవిస్తున్న…

38 minutes ago

క్యాన్సర్ ఫైట్‌లో కొత్త టెక్నాలజీ.. 95 వేల ఖర్చు!

క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధనలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. వ్యాధిని గుర్తించడం, కణితులను తొలగించడం, కీమోథెరపీ, రేడియేషన్…

1 hour ago

కీర్తి సురేష్‌కు మళ్ళీ సావిత్రి కలిసి వస్తుందా

మహానటి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే దాని ప్రభావం ఇండస్ట్రీ మీద ఇంకా చూస్తూనే ఉంటాం. ఆ…

2 hours ago

బన్నీతో బోయపాటి… మాస్టర్ ప్లాన్ అంటే ఇది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కలయికతో గతంలో సరైనోడు వచ్చింది. బన్నీ మాస్ ఇమేజ్ అమాంతం…

3 hours ago

వామ్మో… ఇన్ని తుఫానులను తట్టుకునేది ఎలా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రకృతి మరోసారి పరీక్ష పెట్టబోతోందా? ఇప్పటికే రెండు తుఫానుల ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రానికి ఇప్పుడు మూడో తుఫాను…

3 hours ago