Movie News

మనోళ్లకు మండాడి అంతెందుకు నచ్చింది

నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా హౌస్ ఫుల్ బోర్డులు స్వాగతం పలకడం. మన భాష ఒక్క అక్షరం రాకపోయినా టాలీవుడ్ జనాలు కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడి అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. సుహాస్ వెనకనే ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. వీటి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.

ట్రేడ్ టాక్ ప్రకారం మండాడి ఏపీ తెలంగాణలో సుమారు తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందట. అఫీషియల్ నెంబర్లు అన్ని లాంగ్వేజెస్ కలిపి 65 కోట్లని వేసుకున్నారు కానీ విడిగా డబ్బింగ్ ఎంత చేసిందనేది రివీల్ కాలేదు. ఎలా చూసినా సూరి, సుహాస్ ఇమేజ్ కి ఇది చాలా పెద్ద నెంబర్. అందులోనూ మనకు రెగ్యులర్ గా టచ్ చేయని సముద్ర నేపధ్యాన్ని తీసుకోవడం కంటెంట్ పరంగా రిస్క్ అనిపించింది. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

మనోళ్లకు మండాడిలో అంతగా నచ్చడానికి కారణాలు ఏంటనేది చూస్తే ఇరుముడి తర్వాత క్లాస్ మాస్ ఇద్దరినీ సంతృప్తి పరిచిన పూర్తి స్థాయి సినిమా రాలేదు. పైగా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ కనీసం యూత్ ని కూడా మెప్పించలేకపోగా సర్దార్ 2 మొదటి ఆటకే చాప చుట్టేశాడు. ఇక మహేంద్రగిరి వారాహి బండి అంతంత మాత్రంగానే వెళ్తోంది. ఈ కారణంగా ఇప్పటికీ చాలా చోట్ల ఇరుముడినే వేగంగా ఫుల్స్ కావడం నిన్న మొన్న కనిపించిన అరుదైన ఘట్టాలు. ఇదంతా మండాడికి అడ్వాంటేజ్ గా మారింది.

ఇదే దూకుడు ఇకపై ఉంటుందని చెప్పలేం. మంగళవారం బుకింగ్స్ చూస్తే మన దగ్గర మండాడి నెమ్మదించింది. ఈ వారం ఒకటి రెండు కాదు ఆరేడు కొత్త రిలీజులు ఉన్నాయి కాబట్టి వాటి టాక్ ని బట్టి మళ్ళీ పికప్ అవ్వడం, అవ్వకపోవడం ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేయడంతో మైత్రి డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఇకపై సూరి నటించబోయే సినిమాలకు మన దగ్గర కూడా మార్కెట్ ఏర్పడిపోయింది కాబట్టి హక్కుల ధరలు కూడా పెరుగుతాయి.  

This post was last modified on September 15, 2026 5:03 pm

Share

Recent Posts

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

2 hours ago

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…

2 hours ago

రెండు కిక్ ఇచ్చాయి… ఒకటి షాక్ కొట్టింది

నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…

3 hours ago

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

4 hours ago

పీడకలగా మారుతున్న పార్ట్ 2 ఫలితాలు

ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…

5 hours ago

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…

6 hours ago