ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన విశాఖలోని ఓ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
నాని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆయన కొద్ది నెలల క్రితం టీడీపీలో చేరారు.
ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. ఏలూరు సీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్, ఆంధ్రా యూనివర్సిటీలో బి.కామ్ అభ్యసించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుబెట్టారు 1994,1999 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఏలూరు నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2009లోనూ విజయం సాధించిన నాని 2013లో వైసీపీలో చేరారు. 2014లో పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన నాని ఆ తర్వాత 2017లో వైసీపీ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతల్లో కీలకంగా ఉన్న నాని మరణం ఆ సామాజిక వర్గానికి తీరని లోటు.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…