రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ గాయని జీవితానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తోంది. ముందు సాయిపల్లవి పేరు బలంగా వినిపించింది కానీ రామాయణ 2 కోసం డేట్లు అందుబాటులో లేని కారణంగా ఆ అదృష్టం శ్రీవల్లిని వరించినట్టు ఇన్ సైడ్ టాక్. కింగ్డమ్ ఫెయిల్యూర్ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన ఛాన్స్ ఇది.
ఎవరి సంగతి ఎలా ఉన్నా ఇద్దరికి మాత్రం ఈ సినిమా చాలా పెద్ద ఛాలెంజ్ కానుంది. మొదటగా రష్మిక మందన్న గురించి చెప్పుకోవాలి. పెర్ఫార్మన్స్ ఋజువు చేసుకునే పాత్రలు తాను గతంలోనే చేసింది. రాబోయే రణబాలి, మైసా కూడా ఆ క్యాటగిరీలోనే వస్తాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో ఎత్తు. ఎందుకంటే దశాబ్దాలుగా దేశంలోని కొన్ని కోట్ల ఇళ్లను తన సుమధుర గాత్రంతో పరవశానికి గురి చేసిన ఒక మహత్తర గాయనిగా ఎంతో ఉదాత్తమైన క్యారెక్టర్ ఇది.
మహానటిలో కీర్తి సురేష్ లాగా అందరినీ మెప్పిస్తే చాలు జీవితాంతం గుర్తు పెట్టుకునే మూవీ అవుతుంది. ఇక రెండో సవాల్ అనిరుధ్ రవిచందర్ కు ఉంటుంది. ఇప్పటిదాకా ఫాస్ట్ బీట్ ఆల్బమ్స్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యువ సంచలనం మొదటిసారి కృతులు, కీర్తనలు కంపోజ్ చేయాల్సి ఉంటుంది. వెంకటేశ్వర సుప్రభాతాన్ని అంతే పవిత్రతతో రీ మిక్స్ చేయాల్సి రావొచ్చు. ఇవన్నీ రిస్క్ అనడం కంటే బాధ్యతగా పిలవడం సబబుగా ఉంటుంది.
గతంలో ఇళయరాజా మంచి పీక్స్ లో ఉన్న సమయంలో డివోషనల్ సినిమాలు చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, శ్రీ ఏడుకొండల స్వామి, శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం లాంటివి చాలా పేరు తీసుకొచ్చాయి. అనిరుద్ చేస్తోంది దేవుళ్ళ సినిమా కాదు కానీ సంగీత ప్రపంచం దైవంగా భావించే ఒక మహనీయురాలి కథకు. బీజీఎమ్ కన్నా ఎక్కువగా పాటలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మటుకు కెరీర్ టాప్ వన్ అయ్యే అవకాశం ఉంటుంది.
This post was last modified on September 15, 2026 5:54 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…