విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది వర్కింగ్ టైటిలే అయినప్పటికీ.. ఇదే ఫైనల్ అన్నట్లుగా మీడియాలో ఆ పేరునే వాడేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని చోట్లా ఒకే టైటిల్.. అది కూడా క్యాచీగా ఉండేలా పెట్టడం అవసరం. ‘ఫైటర్’ అలాంటి టైటిలే.
ఈ పేరుతోనే సినిమా ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు హిందీలో ఇదే పేరుతో వేరే సినిమా మొదలవుతుండటం విశేషం. అదేదో చిన్నా చితకా సినిమా అయితే పర్వాలేదు. కానీ హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దీపికా పదుకొనే కథానాయికగా నటించనుంది. ఇంతకుముందు హృతిక్‌తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి భారీ యాక్షన్ సినిమాాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 10న ‘ఫైటర్’ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారట. ‘వార్’ చిత్రాన్ని నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్సే ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇదే సంస్థలో ప్రస్తుతం సిద్దార్థ్.. షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు సగం పూర్తయింది. ఇది పూర్తి కాగానే ‘ఫైటర్’ను మొదలుపెడతాడట సిద్దార్థ్. ఈ ఏడాదే ఈ రెండు చిత్రాలూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
‘ఫైటర్’ ఏరియల్ థ్రిల్లర్ అని.. ఇందులో హృతిక్ పైలట్ పాత్ర పోషించనున్నాడని.. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని అంటున్నారు. హృతిక్-దీపికల కాంబినేషన్ కూడా ఈ సినిమాపై అంచనాల్ని పెంచేదే. ఈ సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ ఖరారైనట్లయితే.. విజయ్-పూరి సినిమాకు కొత్త టైటిల్ వెతుక్కోవాల్సిందే.
This post was last modified on January 10, 2021 10:43 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…