Political News

భోగాపురంలో మోదీ మానియా

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమం మొత్తం ప్రధాని మోదీ చుట్టే తిరిగింది. ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోడీకి నభూతో రీతిలో ఘన స్వాగతం లభించింది. 13 వేల మంది గిరిజన మహిళలలు ప్రదర్శించిన దింసా నృత్యం అద్భుతమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రధానికి ఇంతటి గొప్ప స్వాగతం లభించలేదని చెబుతున్నారు.

రైట్ టైం.. రైట్ లీడర్ మోదీ..

నేషన్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో ముందుకు వెళుతున్న ప్రధాని మోదీని రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ గా అభివర్ణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో డిజిటల్ ఇండియా కల సాకారం చేసింది, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్లతో ప్రజలకు సేవ చేస్తుంది మోదీ ఒక్కరేనని చెప్పారు. దేశం ఐటి నుంచి ఏఐ వైపు వెళుతుందని, ఈ దశలో మోదీ వంటి సమర్ధుడైన నాయకుడి అవసరం ఎంతైనా వుందన్నారు. ఉత్తరాంధ్రలో ఇక పేద అరుపులు ఉండవన్నారు.

నారా మోదీ కలిస్తే నమో….

భారత దేశంలో నమో అంటే నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నమో అంటే నారా చంద్రబాబు, మోదీల అద్భుతమైన జోడి అని తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి నారా లోకేష్ చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభలో లోకేష్ ఆవేశంగా ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో అనాధగా మారిన రాష్ట్రాన్ని ఆడదుకున్న వ్యక్తి మన నమో అని చెప్పారు. ఎర్రబస్సు రాదన్న చోటికి ఎయిర్ పోర్ట్ వచ్చిందని, ఎర్రబస్సు రాదన్న చోటికి మన నమో వచ్చారని చెప్పారు. అదీ ఉత్తరాంధ్ర దెబ్బ… తెలిసిందా రాజా అని జగన్ మీద పరోక్షంగా చురకలంటించారు.

సెంటర్ అట్రాక్షన్ మోదీ…

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ సెంటర్ అట్రాక్షన్గా నిలిచారు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రసంగాలు మొత్తం మోదీ చుట్టే పరిభ్రమించాయి. నా 5 దశబ్దాల రాజకీయ జీవితంలో మోదీ లాంటి నాయకుడ్ని చూళ్ళేదని చంద్రబాబు చెబితే, దేశంలో మోదీ లాంటి లీడర్ లేడు, ఇక రాడని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. ప్రశాంత వదనంతో కూర్చున్న మోదీ తన ప్రసంగంలో ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. చంద్రబాబు కృషి వల్లే పరిశ్రమలు వస్తున్నాయని కొనియాడారు.

This post was last modified on August 2, 2026 6:51 am

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

35 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

42 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago