Movie News

కొత్త కుర్రాడి మీద కామెంట్స్ ఏంటి

భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీని ప్రమోట్ చేసే బాధ్యత భుజాన వేసుకోవడంతో మెయిన్ సెంటర్స్ లో ఉదయం షోలు దాదాపుగా ఫుల్స్ పడ్డాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ని తీసుకురావాలనే ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. కొంత విసుర్లు కూడా వినిపించాయి.

ఇక అసలు పాయింట్ కు వస్తే శ్రీనివాస మంగాపురంకి సామాన్య ప్రేక్షకుల మద్దతు ఏ మేరకు దక్కనుందో ఈ వీకెండ్ కంతా క్లారిటీ వస్తుంది. జయకృష్ణ విషయం చూస్తే కుర్రాడు మరీ లేతగా ఉన్నప్పటికీ నటనలో ఓ మోస్తరుగా కష్టపడిన వైనం డాన్సులు, ఎక్స్ ప్రెషన్లలో కనిపించింది. అయితే భావోద్వేగాలు డిమాండ్ చేసే సీన్లతో పాటు ఇంటెన్సిటీ చూపించాల్సిన సన్నివేశాల్లో మెరుగుపడేందుకు చాలా హోమ్ వర్క్ చేయాలి. ఒక్క మూవీతో అంతా వచ్చేయదు.

హీరోల తొలి సినిమాలు దాదాపు ఇదే తరహాలోనే స్పందన తెచ్చుకుంటాయి. నాగార్జున విక్రమ్ నుంచి రామ్ చరణ్ చిరుత దాకా మిశ్రమ స్పందన సహజంగా కనిపిస్తూనే ఉంటుంది. జయకృష్ణ దానికి మినహాయింపు కాదు. అయితే దర్శకుడు అజయ్ భూపతి నుంచి ఏదైనా సిగ్నేచర్ ట్విస్టు లేదా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఆశించిన ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో కొంత నిరాశ చెందారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్నది రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ కాబట్టి.

జయకృష్ణ నెక్స్ట్ వేయబోయే అడుగులు తనకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సరైన ప్లానింగ్ లేకపోతే కుటుంబం బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా నిలదొక్కుకోవడం కష్టం. తొలినాళ్ళతో సుమంత్ మంచి సక్సెస్ లు సాధించినప్పటికీ తర్వాత చేసిన పొరపాట్ల వల్ల స్టార్ కాలేకపోయాడు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తర్వాత వచ్చేవాళ్లలో గౌతమ్ ఉన్నాడు. తన ఎంట్రీ కన్నా ముందే జయకృష్ణ సెటిలైపోతే ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటారు. 

This post was last modified on July 31, 2026 10:01 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

4 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

4 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

4 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

4 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

7 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

8 hours ago