Movie News

విజయ్ సినిమా బాలయ్యకి బూస్ట్ ఇచ్చింది

కొన్ని సినిమాలు రిలీజ్ టైంలో సరిగా ఆడవు. కానీ తర్వాతి కాలంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఇలాంటి పేరు చాలా వరకు క్లాస్ చిత్రాలకే వస్తుంటుంది. కానీ మాస్ సినిమాలు కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకోవడం అరుదు. పైగా ఒక సినిమా తాలూకు రీమేక్ మూవీ బాలేకపోవడం వల్ల దాని ఒరిజినల్ స్థాయి పెరిగి, కల్ట్ స్టేటస్ రావడం ఇంకా చిత్రం. ‘భగవంత్ కేసరి’ చిత్రం విషయంలో ఇదే జరుగుతోంది.

2023 దసరా కానుకగా విడుదలైన బాలయ్య సినిమా బాగానే ఆడింది.
కానీ దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ మూవీకి తన మిగతా చిత్రాలతో పోలిస్తే అంత పెద్ద విజయం దక్కలేదు. అందుకు బాక్సాఫీస్ పరిస్థితులు కూడా కారణమే. అదే టైంలో రిలీజైన విజయ్ అనువాద చిత్రం ‘లియో’కు విపరీతమైన హైప్ రావడం బాలయ్య చిత్రంపై ప్రభావం చూపించింది. ఇది పూర్తి స్థాయి మాస్ మూవీ కాకపోవడంతో ఆ వర్గం ప్రేక్షకులు కూడా అనుకున్నంతగా ఆదరించలేదు.

కానీ తర్వాత అందరూ మరిచిపోయిన సినిమాకు ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు ఎలివేషన్లు పడట్లేదు. ‘భగవంత్ కేసరి’ ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘జననాయకుడు’ నిన్ననే రిలీజైంది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ బాలయ్య సినిమాను కొనియాడుతున్నారు. దాన్నో గొప్ప సినిమాగా అభివర్ణిస్తున్నారు. L

‘భగవంత్ కేసరి’ని చెడగొట్టారంటూ ‘జననాయకుడు’ మీద విరుచుకుపడుతున్నారు. ఆ సినిమాతో పోల్చి చూస్తే అందరికీ బాలయ్య సినిమా గొప్పదనం అర్థమవుతోంది. ఒరిజినల్లోనే సీన్లను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

వాటిలో బాలయ్య పెర్ఫామెన్స్ చూసినా.. డైలాగులు గమనించినా.. సన్నివేశాల్లోని ఇంటెన్సిటీ చూసినా.. విజయ్ సినిమా తేలిపోతోంది. మంచి కథను అవసరం లేని మార్పులు చేర్పులతో చెడగొట్టారని.. అసలు పెర్ఫామెన్స్‌లో బాలయ్య ముందు విజయ్ ఏమాత్రం నిలవలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు.

‘జననాయకుడు’ రిలీజైన దగ్గర్నుంచి ‘భగవంత్ కేసరి’ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ.. అనూహ్యంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటుండడం విశేషం. అప్పుడు విజయ్ సినిమా వల్లే దెబ్బ తిన్న ‘భగవంత్ కేసరి’ ఇప్పుడు విజయ్ మూవీ వల్లే మంచి పేరు సంపాదిస్తుండడం ఇందులో కొసమెరుపు.

This post was last modified on July 25, 2026 8:55 am

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago