చెన్నై లవ్ స్టోరీ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందనేది తేలడానికి కొంచెం టైం పడుతుంది కానీ వీకెండ్ దాకా ఢోకా లేదనేది మాత్రం వాస్తవం. అయితే ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న మాస్ మూవీ మేకర్స్ లో ఎస్కెఎన్, సాయి రాజేష్ తో పాటు మారుతీ కూడా భాగస్వామన్న సంగతి తెలిసిందే. టైటిల్ కార్డు ప్రారంభంలో ఈ బ్యానర్ వచ్చినప్పుడు మొదట కనిపించేది మారుతీ ఫోటోనే. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో ఎక్కడ మాట వరసకు కూడా కనిపించలేదు.
దీనికి కారణం రాజా సాబ్ తప్ప మరొకటి అయ్యుండదు. చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎస్కెఎనే ప్రభాస్ డిజాస్టర్ గురించి ప్రశ్నలు ఎదురుకోక తప్పలేదు. ఒకవేళ మారుతీ కూడా వీటిలోనో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో పాల్గొని ఉంటే ఖచ్చితంగా అటెన్షన్ ఆయన మీదకు వెళ్ళేది. రాజా సాబ్ గురించి చర్చ వచ్చేది. అసలే ప్రభాస్ ఫ్యాన్స్ మహా కోపంగా ఉన్నారు. అది ఎంతో కొంత చెన్నై లవ్ స్టోరీ మీద చూపిస్తున్నారనేది ఇతరులు చేస్తున్న కామెంట్.
ఇదంతా పక్కనపెడితే మారుతీ నెక్స్ట్ ఎవరితో చేస్తారనే క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. హ్యాపీ పొంగల్ టైటిల్ తో ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నారని, మెగా కాంపౌండ్ లో ఒక హీరోతో లాక్ అవ్వొచ్చనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ప్రతి రోజు పండగే కాంబోని రిపీట్ చేద్దామంటే సాయి దుర్గ తేజ్ ఇప్పుడప్పుడే అందుబాటులో వచ్చేలా లేడు. వరుణ్ తేజ్ కూడా బరితో బిజీ కాబోతున్నాడు.
సో ఇంకెవరైనా వేరే ఆప్షన్ చూడాలి. ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఏడు నెలలు అయిపోయాయి. ఇప్పటిదాకా మారుతీ వైపు నుంచి అనౌన్స్ మెంట్ రాలేదు. బయట కనిపించడమే తగ్గిపోయింది. అయినా డిజాస్టర్లు ప్రతి దర్శకుడికి అనుభవమే. ఇదేమి మారుతీకి ఒకటే వచ్చింది కాదు. గతంలో నష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య ట్రై చేసిన ప్రొడ్యూసర్లున్నారు. మారుతీ అంత దారుణ స్థితికి ఎవరినీ తీసుకెళ్లలేదుగా. అలాంటప్పుడు వీలైనంత త్వరగా హీరోని సెట్ చేసుకుని సినిమా మొదలుపెడితే బెటర్.
This post was last modified on July 24, 2026 10:24 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…