Movie News

నడుము సీన్లు తమిళ సినిమాల్లో లేవా?

ఒకరిని పొగడ్డానికి ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే ఒకరిని విమర్శించే క్రమంలో కూడా అవసరం లేని ఇంకొకరి పేరు తీసుకురావడమూ తప్పే. ఇలాంటి పనే చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు ప్రముఖ తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్. సౌత్ ఇండియాలోనే కాక ఇండియాలోనే మంచి పేరున్న సినీ విమర్శకుల్లో ఆయనొకరు. ఆయనకు రైటర్‌గా మంచి పేరుంది.
వైవిధ్యమైన సినిమాలకు మంచి సపోర్ట్ ఇస్తాడని.. సినిమాలను చాలా లోతుగా విశ్లేషిస్తాడని భరద్వాజ్ రంగన్‌ను అందరూ కొనియాడుతుంటారు.

మన టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఎంతోమంది ఆయన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టఫర్ నోలన్ సైతం భరద్వాజ్ రంగన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి తాజాగా ‘జననాయగన్’ సినిమా రివ్యూలో నోరు జారి తెలుగు వాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఎంతో పేలవంగా రూపొందిన ‘జననాయగన్’ను మిగతా తమిళ క్రిటిక్స్ తెగ మోసేస్తుంటే.. భరద్వాజ్ రంగన్ నెగెటివ్ రివ్యూనే ఇచ్చాడు. కానీ ఇందులో హింసాత్మక సన్నివేశాలను విమర్శించే క్రమంలో తెలుగు సినిమాల్లో హీరోయిన్ల నడుములను చూపించినట్లుగా ఇందులో తలలు తెగి పడడాన్ని పదే పదే చూపించారంటూ ఆయన కామెంట్ చేశారు. ‘జననాయగన్’లో వయొలెన్స్ గురించి విమర్శించడానికి.. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల నావెల్ షోతో పోలిక ఏంటన్నది అసలు అర్థం కాని విషయం.

ఈ పోలిక ఎంతమాత్రం అవసరం లేనిది. అయినా హీరోయిన్ల అందాలను సొమ్ము చేసుకోవడం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమా? తమిళ సినిమాలు ఇందులో ఏం తక్కువ అన్నది ఆలోచించుకోవాలి. ఓవైపు బాలీవుడ్ వాళ్లు హిందీ చిత్రాలు పరమ పవితమైనట్లుగా, సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతుంటే.. భరద్వాజ్ ఏమో తెలుగు సినిమాలను కించపరిచేలా కామెంట్ చేశాడు.

సిమ్రాన్‌ సహా ఎందరో స్టార్ హీరోయిన్ల నడుము, బొడ్డు మీద తమిళ సినిమాల్లో కెమెరాలు ఎంతగా ఫోకస్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగమ్మాయి అంజలితో ఒక సినిమాలో హీరో కమ్ డైరెక్టర్ ఎలాంటి సీన్లు చేయించాడో యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. కేవలం తెలుగు సినిమాలకే నావెల్ షోలు పరిమితం అన్నట్లు భరద్వాజ్ రంగన్ ఈ కామెంట్ చేయడంతో ఆయనకు వీడియోలతోనే సమాధానం ఇస్తూ వాయించి వదిలిపెడుతున్నారు తెలుగు నెటిజన్లు.

This post was last modified on July 24, 2026 11:18 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

6 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

8 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

10 hours ago