ఇప్పటిదాకా ఇండియన్ సినిమాల్లో అనేక రకాల హీరో ఎలివేషన్లు చూశాం. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో టాలీవుడ్ దర్శకుల శైలే వేరు. రాజమౌళి సహా చాలామంది దర్శకులు హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లినవాళ్లే. ఐతే రాజమౌళిని సైతం మించిపోయేలా ‘కేజీఎఫ్’ మూవీలో హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించి ఔరా అనిపించాడు ప్రశాంత్ నీల్. అతను ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడు అనడానికి.. యశ్ లాంటి మనకు పరిచయం లేని హీరో సినిమా చూస్తూ ఒక సూపర్ స్టార్ మూవీ చూస్తున్న భావన కలగడమే నిదర్శనం.
మామూలుగా మనకు కొత్త అయిన హీరోకు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇస్తుంటే మనం కనెక్ట్ అవలేం. అదోలా అనిపిస్తుంది. కానీ ‘కేజీఎఫ్’లో మాత్రం హీరోయిజానికి మన వాళ్లే కాదు.. వివిధ భాషల వాళ్లు కనెక్టయ్యారు. చాప్టర్-1లో హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి కేజీఎఫ్‌లో తొలిసారి హీరో రౌడీ బ్యాచ్ మీద ఎదురు తిరిగే సన్నివేశం వరకు హీరోయిజం ఓ రేంజిలో ఎలివేట్ అయిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు ‘కేజీఎఫ్-2’లో ఎలివేషన్ల మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా.. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్లో ఫైనల్ పంచ్ ఇచ్చి ఔరా అనిపించాడు ప్రశాంత్ నీల్. చివర్లో షూటింగ్, సిగరెట్ వెలిగించుకునే సీన్లు చూశాక మాస్‌కు పూనకాలు వచ్చేశాయి.
కన్నడలో కూడా మీడియం రేంజ్ హీరోనే అయిన యశ్‌ను పెట్టి ఇలా హీరోయిజం ఎలివేట్ చేసిన ప్రశాంత్.. ‘బాహుబలి’ సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ను ‘సలార్’లో ఇంకెలా చూపిస్తాడో.. అందులో హీరోయిజం ఇంకెంత ఎలివేట్ అవుతుందో అని ఊహించుకుంటూ పులకించిపోతున్నారు మన అభిమానులు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో కూడా ప్రశాంత్ జట్టు కట్టే అవకాశముండటంతో ఆ మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న ఆసక్తి కూడా కలుగుతోంది. ఐతే హీరో ఎలివేషన్ల విషయంలో తన ఐడియాలన్నీ ‘కేజీఎఫ్’ కోసమే వాడేయకుండా.. కొన్ని ప్రభాస్, తారక్‌ల కోసం కూడా దాచుకోవాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 8, 2021 3:34 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…