Movie News

ప్యాడెడ్, బంప్ బ్రాల కోసం ఒత్తిడి తెచ్చేవాళ్లు – స‌మీరా రెడ్డి

తాను క‌థానాయిక‌గా న‌టించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమ‌ని ఫిలిం మేక‌ర్స్ విప‌రీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్ల‌ని స‌మీరా రెడ్డి ఒక ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించింది. తెలుగులో అశోక్, న‌ర‌సింహుడు, జై చిరంజీవ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించిన స‌మీరా.. హిందీలోనూ ప‌లు చిత్రాలు చేసింది. త‌మిళంలోనూ వార‌ణుం ఆయిరం (సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌)లో న‌టించింది. చాలా ఏళ్ల ముందే సినిమాల‌కు గుడ్ బై చెప్పి వ్య‌క్తిగ‌త జీవితంలో స్థిర‌ప‌డ్డ స‌మీరా.. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో అనేక ఆస‌క్తిక‌ర టాపిక్స్ గురించి మాట్లాడింది.

ఇందులో భాగంగా ఆమె హీరోయిన్ల మీద ప్యాడెడ్, బంప్ బ్రాల కోసం ఎలా ఒత్తిడి తెస్తారో వివ‌రించింది. 20 ఏళ్ల పాటు తాను ఈ త‌ర‌హా బ్రాలు ధ‌రిస్తూనే ఉన్న‌ట్లు వ్యాఖ్యానించింది. హీరోయిన్ల‌కు బ్లౌజ్‌లో ప్యాడెడ్ బ్రాలు పెట్ట‌డం మామూలే అని.. మీ బంప్ ఫ్లాట్‌గా ఉంది అంటూ న‌డుం కింద కూడా బ్రాలు పెట్టించిన సంద‌ర్భాలు చాలా ఉన్న‌ట్లు ఆమె చెప్పింది.

అసిస్టెంట్ డైరెక్ట‌ర్లే ఈ మాట చెబుతార‌ని.. త‌న‌కైతే లేడీ ఏడీలే వ‌చ్చి ఓపెన్‌గా విష‌యం చెప్పేవార‌ని ఆమె వ్యాఖ్యానించింది.
ఇక త‌న స్కూల్ రోజుల్లో ఎదురైన ఒక చేదు అనుభ‌వం గురించి ఈ ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది. ఒక రోజు బాంద్రాలో స్కూల్ బ్యాగ్ వేసుకుని న‌డుచుకుని వ‌స్తుంటే.. సైకిల్ మీద వ‌చ్చిన ఒక కుర్రాడు త‌న చెస్ట్ మీద గ‌ట్టిగా కొట్టి న‌వ్వుకుంటూ వెళ్లాడ‌ని.. తాను ఊరుకోకుండా అత‌ణ్ని వెంబ‌డించి సైకిల్ మీది నుంచి కిందికి తోసి, కొట్టి బుద్ధి చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించింది.

పిల్ల‌ల‌కు సెక్స్ ఎడ్యుకేష‌న్ నేర్పించాల్సిన అవ‌స‌రాన్ని ఈ ఇంట‌ర్వ్యూలో స‌మీరా గుర్తు చేసింది. త‌న‌కు త‌ల్లిదండ్రులు ఆ విష‌యాలు చెప్ప‌క‌పోవ‌డం, ఏవో పిచ్చి పుస్త‌కాల్లో చ‌దివి తెలుసుకోవాల్సి వ‌చ్చింద‌ని.. కానీ తాను మాత్రం త‌న పిల్ల‌లకు సెక్స్ ఎడ్యుకేష‌న్ గురించి అన్నీ వివ‌రంగా చెబుతాన‌ని ఆమె అంది.

This post was last modified on July 18, 2026 2:40 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

56 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago