Movie News

మహేష్ పుట్టినరోజుకి ఫోటోలు సరిపోవు

వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి దాన్నుంచి టీజర్ కావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదో అకేషన్ వచ్చింది కాబట్టి హడావిడి పడటం జక్కన్న స్టైల్ కాదు. తాను అనుకున్నట్టు అవుట్ ఫుట్ వచ్చిందనుకుంటే తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వరు. ఫ్యాన్స్ టెన్షన్ పడుతోంది ఇదే విషయంలోనే. నిజంగా ఇస్తారా లేక హ్యాండ్ ఇచ్చేసి వెయిట్ అండ్ సీ అంటారాని ఎదురు చూస్తున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారమైతే బర్త్ డేకి వారణాసి అప్డేట్ ఉంది. అయితే ఇవాళ ప్రియాంకా చోప్రా ఫోటోలు రెండు వదిలినట్టు మహేష్ బాబుకి అలా చేస్తే సరిపోదు. ఇంటర్ నెట్ బ్లాస్ట్ అయ్యే విజువల్ లేదా వీడియో చూపించాలి. అప్పుడే కిక్ వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మరో మహేష్ పుట్టినరోజు వచ్చేనాటికి వారణాసి థియేటర్ రిలీజ్ పూర్తి చేసుకుని ఓటిటిలోకి వచ్చేసి ఉంటుంది కాబట్టి.  అప్పుడు చెప్పడానికి ఇవ్వడానికి ఏమీ ఉండదు.

సో వంద శాతం ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే అదే డేట్ కి పోకిరి రీ రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ అయిన సినిమాకు మళ్ళీ ప్రమోషన్లు చేయడం ఎందుకని అనుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. గత ఏడాది అతడుని తీసుకొచ్చి ఇలాగే డైవర్ట్ చేశారు. ఈసారి ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు. రాజమౌళి అయితే ఒక టీజర్ రెడీ చేయిస్తున్నారట. కాకపోతే ఫైనల్ టచప్స్ వగైరాలన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న వారణాసి మీద పబ్లిసిటీ పరంగా పెద్ద భారం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించే టార్గెట్ పెట్టుకున్న రాజమౌళి ఈసారి ఆస్కార్ మీద మరింత గురి పెట్టారు. ఒక పాటకో ఫైట్ కో కాకుండా దర్శకత్వానికి రావాలనేది జక్కన్న కల. వారణాసితో అది తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న వారణాసిలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. 

This post was last modified on July 18, 2026 2:14 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

11 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago