Movie News

ఒడిస్సీ వరదలో అన్నీ కొట్టుకుపోయాయి

క్రిస్టఫర్ నోలన్ సినిమా వస్తే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేకవుతుందో మరోసారి రుజువైంది. నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ఒడిస్సీ’ దెబ్బకు అన్ని సినిమాలూ కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఇండియాలో అయితే దాని ముందు ఏ సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. గత వారాంతంలో విడుదలై బాగా ఆడుతున్న సినిమాలన్నింటినీ ‘ది ఒడిస్సీ’ గట్టి దెబ్బే తీస్తోంది.

హిందీలో అజయ్ దేవగణ్ సినిమా ‘ఢమాల్-4’.. తెలుగులో ‘లెనిన్’.. ఇలా చాలా సినిమాలు మొన్నటి వరకు బాగానే ఆడుతుండగా.. శుక్రవారం నోలన్ సినిమా బాక్సాఫీస్‌ను టేకోవర్ చేసేసింది. దాని ముందు ఈ ప్రాంతీయ భాషా చిత్రమైనా తన ఉనికిని చాటుకోవడం కష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ది ఒడిస్సీ’ ఊపు మామూలుగా లేదు.

ఈ శుక్రవారం టాలీవుడ్ నుంచి అరడజను కొత్త తెలుగు సినిమాలు వచ్చాయి. కానీ వాటిని జనం ఏమాత్రం పట్టించుకోలేదు. ఐశ్వర్యా రాజేష్, తిరువీర్‌ల ‘ఓ సుకుమార్’ ఓ మాదిరిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, దానికి బ్యాడ్ టాక్ రావడంతో థియేటర్లలో జనం కనిపించడం లేదు. మిగతా చిత్రాలైతే కనీసం ప్రేక్షకుల దృష్టిలో పడట్లేదు. వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్, ఎంఆర్పీ, రాజాదిరాజా.. ఇలా పేరుకేమో చాలా సినిమాలు వచ్చాయి.

కానీ ఇవేవీ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. నిన్న ఉదయం నుంచి ఏ మల్టీప్లెక్స్ చూసినా.. ‘ది ఒడిస్సీ’ హంగామానే కనిపిస్తోంది. ప్రతి మల్టీప్లెక్స్‌లోనూ సగానికి పైగా షోలు ఆ సినిమాకే ఇచ్చేశారు. అన్ని షోలకూ ఫుల్స్ పడుతున్న పరిస్థితి. కానీ పక్కన తెలుగు సినిమాలకు మాత్రం మినిమం ఆక్యుపెన్సీలు లేవు. కొత్త చిత్రాలతో పోలిస్తే.. ముందు వారం వచ్చిన ‘లెనిన్’ పరిస్థితే కొంచెం మెరుగు. ఈ వారం వచ్చిన చిత్రాలన్నీ నోలన్ దెబ్బకు వాషౌట్ అయిపోయినట్లే కనిపిస్తోంది.

This post was last modified on July 18, 2026 11:22 am

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

55 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

2 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

3 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

3 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

4 hours ago