వారణాసి గురించి ఎంతైనా ఊహించుకోండి

నిన్న విడుదలైన హాలీవుడ్ మూవీ ది ఒడిస్సికి ఇండియాలో బ్రహ్మరథం దక్కుతోంది. క్రిస్టోఫర్ నోలన్ గత సినిమాలు దేనికి రానంత భారీగా 20 కోట్ల ఓపెనింగ్ వచ్చిందని ట్రేడ్ ప్రాధమికంగా చెబుతున్న రిపోర్టులను బట్టి అర్థమవుతోంది. నిన్న మెయిన్ సెంటర్స్, ప్రీమియం స్క్రీన్స్, మల్టీప్లెక్సుల్లో ఎనభై శాతానికి పైగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. తెలుగు వెర్షన్ అందుబాటులోకి తేవడంతో బిసి సెంటర్లలోనూ మంచి నెంబర్స్ వస్తున్నాయి. పలు చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి.

నిజానికి ఒడిస్సి ఒక విజువల్ ఫీస్ట్ లా అనిపించిన మాట వాస్తవమే కానీ సాధారణంగా టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకునే ఎమోషనల్ డెప్త్, ఎలివేషన్ ఇందులో పూర్తి స్థాయిలో లేదు. అయినా సరే తనకు మాత్రమే సాధ్యమయ్యే టెక్నికల్ బ్రిలియన్స్ నోలన్ చూపించారు. అయితే వారణాసి విషయంలో రాజమౌళి తీసుకుంటున్న శ్రద్ధ, కంటెంట్ ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారన్న దాని గురించి వస్తున్న లీకులు చూస్తుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఇండియన్ ఒడిస్సిగా జక్కన్న సమాధానం చెప్పేలా ఉన్నారు.

పైకి రామాయణం స్ఫూర్తిగా తీసుకున్నారని చెబుతున్నప్పటికీ వారాణసిలో ఊహకందని ఎన్నో మాయాజాలాలతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారు. రాముడు కుంభకర్ణుడి మధ్య యుద్ధం ఊహించడానికే షాక్ అనిపిస్తే వాళ్ళు ఇద్దరూ మళ్ళీ పునర్జన్మ ఎత్తి యుద్ధానికి సిద్ధ పడటం రాజమౌళి మాత్రమే ఆలోచించే సాహసం. భారతదేశం నుంచి ఆఫ్రికా అంటార్టికా దాకా ఆయన చూపించబోయే మయా ప్రపంచాల గురించి పేరొందిన ఫిలిం మేకర్స్ మాట్లాడుకోవడం ఖాయం.

చాలా సెలెక్టివ్ గా ఇండియన్ సినిమాలు చూసే జపాన్ జనాలను తన ఆర్ఆర్ఆర్ తో కట్టిపడేసిన రాజమౌళి ఈసారి దానికి పదింతలు భావోద్వేగాలను విఎఫ్ఎక్స్ కి ముడిపెట్టి ఆవిష్కరించబోతున్నారు. మనవాళ్ళు ఎలా అయితే ఒడిస్సి చూసి మైమరిచిపోతున్నారో అదే విధంగా వారణాసి చూశాక విదేశీయులు సైతం అంతకు మించిన ఫీలింగ్ ఇవ్వబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదలకు రెడీ అవుతున్న ఈ విజువల్ గ్రాండియర్ కు కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.