స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆయనకు సహాయ నిరాకరణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ ఏ సినిమా చేసినా.. 23 క్రాఫ్ట్స్ నుంచి సహకారం అందించవని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా తెలియజేయనున్నట్లు సమాఖ్య ప్రకటించింది. తన భార్య సుమలత పదవిని అడ్డుపెట్టుకుని జానీ మాస్టర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని జానీ మాస్టర్ మీద ఫెడరేషన్ మండిపడింది.
ఈ నెల 12న ఫెడరేషన్ నాయకత్వంపై జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సమాఖ్య.. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అతను మాట్లాడాడని, ఈ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరినా, 14న విచారణకు పిలిచినా జానీ హాజరు కాలేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఏడు రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని.. తన చర్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో శాశ్వత బహిష్కరణ వేటు వేసేలా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
తెలుగు డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొందరు నకిలీ బిల్లులతో నిర్మాతలను మోసం చేస్తున్నట్లు గుర్తించి, వారిపై చర్యలు ప్రారంభించినందుకే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించిన సుమలత.. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ మీదా పలు ఆరోపణలు చేశారు. సమాఖ్య పెద్దలు అవినీతిపరులకే మద్దలు పలుకుతున్నారని.. తమపై అణచివేతకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భార్యతో కలిసి జానీ మాస్టర్.. ఫెడరేషన్ మీద పలు విమర్శలు, ఆరోపణలు చేయడంతో సమాఖ్య ఇప్పుడీ సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకుంది. దీనిపై జానీ ఏమంటాడో చూడాలి మరి.
This post was last modified on July 18, 2026 10:48 am
https://youtu.be/SORZsU6Ytp4?si=bI3U08bsMtwlX-Oz కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు చేసిప్పటికీ.. ఇంకా రష్మిక మందన్నా అంటే ఒక క్యూట్ అమ్మాయిగానే జనాలకు గుర్తుకొస్తుంది.…
టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…
నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…
ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్టయిందంటే.. ఆ చిత్రానికి కలిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు తమ చిత్రాల్లో…