వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు గానీ… ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ఏవైనా ఏ ఒక్క పార్టీతో పొత్తు అన్న మాటే లేకుండా ఒంటరిగా పోటీకి దిగుతారని… సింహం సింగిల్ గా వస్తుందంటూ వారు చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరైనా జగన్ అడుగుజాడల్లో నడవాల్సిందే గానీ… ఆయన ఏ ఒక్కరిని అనుకరించరని కూడా చెబుతూ ఉంటారు. ఒంటరి పోరు వరకైతే ఓకే గానీ… అనుకరణ విషయంలో మాత్రం తన వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నారని చెప్పక తప్పదు. తమిళనాట సంచలన విజయం నమోదు చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం కుర్చీని అందుకున్న టీవీకే అదినేత, తమిళ సీఎం జోసెఫ్ విజయ్ అడుగుజాడల్లోకి జగన్ దిగిపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీని పెట్టిన విజయ్… ఇటీవల ముగిసిన ఎన్నికలకు పకడ్బందీ ప్లాన్ తో సాగారు. తన పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కపిల్ సాహు, జాన్ ఆరోక్యసామిల సేవలను వినియోగించుకున్నారు. ఇక తన పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తతో నేరుగా సంబంధం కొనసాగించేందుకు మై టీవీకే పేరిట ఓ యాప్ నూ రూపొందించుకున్నారు. వ్యూహాల రచనలో ఆరితేరిన కపిల్, జాన్ ల సలహాలు, మై టీవీకే యాప్ ను సమర్ధవంతంగా నిర్వహించిన విజయ్… ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించారు.
కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలోనూ 2029 సార్వత్రిక ఎన్నికలకు విపక్ష వైసీపీ కూడా అచ్చు గుద్దినట్లు టీవీకే మాదిరిగానే అడుగులు వేస్తోంది. టీవీకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహును వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకునే దిశగా అడుగులు వేస్తోందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఈ దిశగా కపిల్ తో జగన్ అండ్ కో చర్చలు జరిపిందని, ఈ చర్చల్లో పురోగతి కూడా ఉందని, త్వరలోనే ఈ విషయంపై జగనే అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో ప్రశాంత్ కిశోర్ సేవలతో గెలిచిన జగన్… ఈ దఫా కపిల్ సేవలతో గట్టెక్కాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇక జగన్ 2.0 సూపర్ యాప్ పేరిట జగన్ ఓ యాప్ ను గురువారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ అచ్చు గుద్దినట్లుగా మై టీవీకే యాప్ ను పోలి ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి, మై టీవీకే యాప్ ద్వారా కింది స్థాయి కార్యకర్తలతోనూ విజయ్ ఏ రీతిన బంధం నెరిపారో… సూపర్ యాప్ ద్వారా జగన్ కూడా కింది స్థాయి కేడర్ తో తన బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా అటు రాజకీయ వ్యూహ రచనలో అయినా, ఇటు యాప్ ఆవిష్కరణలో అయినా జగన్ అచ్చు గుద్దినట్లుగా విజయ్ ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారన్న వాదనలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి విజయ్ ఫార్ములాను కాపీ కొట్టేస్తున్న జగన్… 2029 ఎన్నికల్లో ఏ రకమైన ఫలితాన్ని సాధిస్తారో చూడాల్సి ఉంది.
This post was last modified on July 18, 2026 8:36 am
స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే ఎక్కువ షోలు వేసుకునేందుకు…
అమెరికాలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరోసారి ఫోకస్ లోకి వచ్చారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ…
అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసినందుకు కేసులు పెట్టడం, అరెస్టులకు సిద్ధపడటం వంటి వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…
ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి…
కొన్ని రోజుల ముందు వరకు శ్రీలీల పనైపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.…
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం దక్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి పార్టీలే…