Movie News

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ అసోసియేష‌న్లో ఏక‌ప‌క్షంగా ఉప ఎన్నిక‌ల‌కు ప్ర‌క‌ట‌న ఇచ్చిందంటూ సంఘం జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త మీద ఒక వ‌ర్గం ఆరోప‌ణ‌లు చేయ‌డం.. ఆ వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు, జానీ మాస్ట‌ర్‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డం తెలిసిందే.

ఐతే మెగాస్టార్ చిరంజీవి దృష్టికి ఈ విష‌యం వెళ్ల‌డంతో ఆయ‌న జోక్యం చేసుకోవ‌డంతో ఈ వివాదం స‌మ‌సిపోయిన‌ట్లే క‌నిపించింది. జానీ మాస్ట‌ర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి.. త‌మ మ‌ధ్య ఏ గొడ‌వ‌లూ లేవ‌ని.. అంత‌ర్గ‌తంగా అసోసియేష‌న్లో చిన్న స‌మ‌స్య అని.. దాంతో త‌న‌కు, శేఖ‌ర్‌కు సంబంధం లేద‌ని చెప్పాడు. అంత‌టితో ఈ వ్య‌వ‌హారానికి తెర‌ప‌డింద‌ని అనుకున్నారు.

కానీ రెబ‌ల్ వ‌ర్గంలో ఉన్న మ‌రో ఫేమ‌స్ డ్యాన్స్ మాస్ట‌ర్ దినేష్.. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో జానీ మాస్ట‌ర్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. జానీ స్థానిక డ్యాన్సర్ల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నాడ‌ని.. అత‌ను చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను సైతం మోసం చేశాడ‌ని దినేష్ ఆరోపించాడు. త‌న‌కు ఇల్లు లేక‌ అద్దె ఇంట్లో ఉంటున్నాన‌ని, బ్యాంక్ బ్యాలెన్స్ ల‌క్ష రూపాయ‌లే ఉంద‌ని చెప్పిన జానీ మాస్ట‌ర్.. డ్యాన్స‌ర్ల ఇన్సూరెన్స్ కోసం రూ.18 ల‌క్ష‌లు విరాళంగా ఎలా ఇచ్చాడ‌ని దినేష్ ప్ర‌శ్నించాడు.

ఒక స‌మ‌స్య త‌లెత్తిన‌పుడు దాన్ని మ‌రుగున ప‌రిచేందుకు జ‌రిగే ప్ర‌య‌త్నం ఇద‌ని అత‌న‌న్నాడు. జానీ మాస్ట‌ర్ తాను కంపోజ్ చేసే పాట‌ల‌కు లోక‌ల్ డ్యాన్స‌ర్ల‌ను పెట్టుకోడ‌ని, ముంబ‌యి నుంచే డ్యాన్స‌ర్ల‌ను తెప్పిస్తాడ‌ని.. ఇదంతా క‌మిష‌న్ కోస‌మే అని దినేష్ ఆరోపించాడు.

తెలుగు రాష్ట్రాల్లో వేల‌మంది డ్యాన్సర్లు ఉన్నార‌ని.. వాళ్లు ఒక రోజుకు రెండు మూడు వేలే తీసుకుంటార‌ని.. కానీ జానీ మాత్రం ముంబ‌యి నుంచి ఎంతో ఖ‌ర్చు పెట్టించి డ్యాన్స‌ర్ల‌ను తెప్పిస్తాడ‌ని.. వాళ్ల‌కు రోజు జీతం 7-8 వేలు అని లెక్క‌లు చూపిస్తార‌ని.. అందులో స‌గం క‌మిష‌న్ తీసుకుని మిగ‌తాది త‌న జేబుల్లో వేసుకుంటాడ‌ని.. లోక‌ల్ డ్యాన్స‌ర్ల‌ను పెట్టుకుంటే క‌మిష‌న్ రాద‌ని, ఇలా చేస్తార‌ని.. ఇది డ్యాన్స‌ర్ల‌తో పాటు నిర్మాత‌ల‌కూ న‌ష్టం చేకూర్చేదే అని దినేష్ అన్నాడు. ఇలాంటి వ్య‌వ‌హారాల‌పై ప్ర‌శ్నిస్తున్నందుకే అసోసియేష‌న్లో గొడ‌వ‌ల‌ని దినేష్ అన్నాడు.

This post was last modified on July 17, 2026 8:30 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

49 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago