బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించిన తమన్నా.. ఇప్పుడు ఇక్కడి చిత్రాల గురించి తక్కువ చేసి మాట్లాడ్డం మీద విమర్శలు తప్పలేదు.
అక్కడికేదో బాలీవుడ్లో హీరోయిన్లలో ఉదాత్తమైన పాత్రలే చేయించేట్లుగా ఆమె మాట్లాడింది. కానీ ఆమె బాలీవుడ్లో చేసినవి కూడా గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్సే. ‘లస్ట్ స్టోరీస్’, ‘జీ కర్దా’ లాంటి వెబ్ సిరీస్‌ల్లో ఆమె చేసిందేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు తమన్నా ఒప్పుకున్న కొత్త సినిమా సంగతేంటో తెలిస్తే ఆమె కామెంట్లు మరింత విడ్డూరంగా అనిపించక మానవు.
బాలీవుడ్లో బోల్డ్ సినిమాలకు పెట్టింది పేరైన ఏక్తా కపూర్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘రాగిణి-3’లో తమన్నా నటించబోతోంది. దీని గురించి ఇంతకుముందే వార్తలు రాగా.. ఆ విషయం అధికారికం అయింది. తమన్నానే ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. ‘రాగిణి ఎంఎంఎస్’ ఫ్రాంఛైజీలో ఈ చిత్రం భాగం. తొలి రెండు చిత్రాలకు బోల్డ్ సీన్లే ఆకర్షణగా మారాయి.
ఏక్తా కపూర్ ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీసి సొమ్ము చేసుకుంటూ ఉంటుంది. ‘రాగిణి ఎంఎంఎస్-2’లో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ లీడ్ రోల్ చేయడం గమనార్హం. ఇప్పుడు పార్ట్-3కి తమన్నా హీరోయిన్ కాబోతోంది. ఈ ఫ్రాంఛైజీ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘లస్ట్ స్టోరీస్-2’ను మించి ఇందులో తమన్నా బోల్డ్ ట్రీట్ ఇస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on July 17, 2026 6:50 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…