వచ్చే వారం విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీకి ఏదైనా సమస్య ఉందంటే, అది ఒక రోజు ముందు జన నాయకుడు రిలీజ్ కావడమే. అయితే కంటెంట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్న టీమ్ దాన్నో అడ్డంకిగా భావించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేస్తోంది ప్రముఖ సంస్థ కాబట్టి థియేటర్ల పరంగా తగినన్ని దొరకవేమోననే అనుమానం మీడియా నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ అలాంటిదేమి ఉండదని, పైగా వారికి థాంక్స్ చెప్పే సందర్భం త్వరలోనే వస్తుందని నిర్మాత ఎస్కెఎన్ చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఈ విషయం గురించి కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ ముందు చెన్నై లవ్ స్టోరీకే ప్రాధాన్యం ఇస్తారని, పైగా జన నాయకుడు భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి మన జనాలు అంతగా ఆసక్తి చూపకపోవచ్చనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. ఆ లాజిక్ సరైందే. ఎందుకంటే బాలకృష్ణని చూసిన పవర్ ఫుల్ క్యారెక్టర్ లో మళ్ళీ విజయ్ ని కొత్త ఓన్ చేసుకోవడం అంత ఈజీగా ఉండదు. తమిళ అభిమానులు వేరు కాబట్టి అక్కడ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది.
ఏపీ తెలంగాణలో జన నాయకుడుకి ఎక్కువ స్క్రీన్లు దక్కినా దక్కకపోయినా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆయన ప్రభావం ఇక్కడ ఉంటుందని చెప్పడానికి లేదు. తుపాకీ నుంచి ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం వరకు ఆయన చేసినవన్నీ స్ట్రెయిట్ సబ్జెక్టులే. జన నాయకుడు ఫక్తు రీమేక్ అనే విషయం ట్రైలర్ లోనే బయట పడింది. విజయ్ మీద విపరీతమైన అభిమానం ఉన్న తెలుగు ఫ్యాన్స్ ఫస్ట్ డే వెళ్తారు కానీ రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూస్తారు.
ఈ అవకాశాన్ని చెన్నై లవ్ స్టోరీ వాడుకోవాలి. కంటెంట్ మీద విపరీతమైన నమ్మకాన్ని చూపిస్తున్న టీమ్ ముందు రోజు ప్రీమియర్లకు రెడీ అవుతోందని సమాచారం. బేబీకి ఫాలో అయిన స్ట్రాటజీనే దీనికీ పాటిస్తారని తెలిసింది. దాని వల్ల రిలీజ్ రోజు ఉదయం నాటికి పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో వచ్చేస్తే మంచి ఓపెనింగ్స్ కి దారి దొరుకుతుంది. దర్శకుడు రవి నంబూరి కన్నా నిర్మాత కం రచయిత సాయి రాజేష్ ప్రమోషన్స్ లో హైలైట్ కావడం గమనించాల్సిన విషయం.
This post was last modified on July 17, 2026 9:20 am
జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…