Movie News

ఫౌజీ సామజిక వర్గం గురించి అప్పుడే చర్చ

నిన్న విడుదలైన ఫౌజీ ఫస్ట్ లుక్ మీద చర్చలు, మీమ్స్ మొదలైపోయాయి. రెగ్యులర్ హీరో గెటప్ కాకుండా ప్రభాస్ ని షర్ట్ లెస్ గా చూపిస్తూ ఒక యుద్ధ వాతావరణంలో దర్శకుడు హను రాఘవపూడి ప్రెజెంట్ చేసిన తీరుకి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇప్పుడు మాకు స్పిరిట్ కన్నా ముందు కిక్ ఇచ్చే సినిమా ఇదేనంటూ సంతోషపడుతున్నారు. బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ పోస్టర్ మీద డిబేట్లు కనిపిస్తున్నాయి. అన్నింటిలోనూ ఉన్న కామన్ పాయింట్ ప్రభాస్ ఒంటి మీద ఉన్న జంధ్యం.

ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టే ప్రభాస్ ఇందులో బ్రాహ్మణుడిగా నటిస్తున్నాడన్న పాయింట్ కు క్లారిటీ వచ్చేసింది. అయితే సైన్యంలో ఎందుకు చేరాడు, సుభాష్ చంద్ర బోస్ తో ఎందుకు జట్టు కట్టాడనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. మూవీ లవర్స్ గతంలో హీరోలు బ్రాహ్మిన్స్ గా నటించిన సినిమాలు తవ్వుతున్నారు. అదుర్స్ జూనియర్ ఎన్టీఆర్, డీజే దువ్వాడ జగన్నాధం అల్లు అర్జున్, జెంటిల్ మెన్ అర్జున్, ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి ఇలా చాలా లిస్టు ఉంది.

అయితే ఫౌజీ వీటన్నింటికి చాలా భిన్నం. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. 1932లో జరిగిన స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో జరుగుతుంది. ఒక అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతమూ ఉంటుంది. ఇవన్నీ ఫౌజీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయని టీమ్ నమ్మకం. వచ్చే వారంలో టీజర్ లాంచ్ చేసే ప్లానింగ్ ఉందట. మూడు నిమిషాల వీడియో దాదాపు సిద్ధంగా ఉందని అంతర్గత వర్గాల సమాచారం.

డిసెంబర్ 3 ఇంకా దూరంలో ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఫౌజీ బృందానికి ప్రయాణం ముళ్ల మీద జరుగుతోంది. ఎందుకంటే ఇంకా ప్రభాస్ వర్కింగ్ డేట్లే ముప్పైకి పైగా కావాలట. సో పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వగైరాలకు అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయడానికి లేదు. రాజా సాబ్ లాగా డిసెంబర్ ప్రకటించి తర్వాత సంక్రాంతికి వెళ్లిన పొరపాటు ఫౌజీ టీమ్ చేయడం లేదు. రికార్డులు బద్దలవ్వాలంటే సోలో రిలీజ్ దక్కాల్సిందే.  

This post was last modified on July 17, 2026 10:33 am

Share

Recent Posts

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

1 hour ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

2 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

2 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

7 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

9 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

11 hours ago