Movie News

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. స్వయంగా మోహన్ బాబే సినిమాలు తగ్గించేయడం, రచయితలు-దర్శకులు కూడా ఆయనకు సరైన పాత్రలు ఇవ్వకపోవడం వల్ల ఈ లెజెండరీ నటుడి అద్భుత ప్రతిభ కొత్త తరానికి పెద్దగా తెలియలేదు. ఐతే మళ్లీ మోహన్ బాబును ఆయన స్థాయికి తగ్గ పాత్రలో చూడలేం అనుకుంటే.. ‘ది ప్యారడైజ్’లో షికంజ మాలిక్ క్యారెక్టర్లో మెరిశారు.

ఇది మరీ గొప్ప పాత్ర అని చెప్పలేం కానీ.. గత 20 ఏళ్లలో చేసిన చాలా పాత్రల కంటే ఎంతో బెటర్. ‘ది ప్యారడైజ్’ ఒప్పుకోవడానికి శ్రీకాంత్ ఇచ్చిన నరేషన్‌తో పాటు ఇది నాని సినిమా కావడం కూడా ఓ ముఖ్య కారణం అంటూ ఈ చిత్ర బృందంతో చేసిన చిట్ చాట్‌లో మోహన్ బాబు వెల్లడించారు. ఐతే తన పాత్ర గురించి చెప్పినపుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా శ్రీకాంత్ ఓదెల తనను మోసం చేశాడని ఆయన చెప్పడం విశేషం.

మోహన్ బాబుకు షికంజ మాలిక్ పాత్ర గురించి చెప్పినపుడు.. ఆయనకు జోడీగా ఒక హీరోయిన్ కూడా ఉంటుందని చెప్పాడట శ్రీకాంత్. ఈ పాత్ర కోసం పాత ఆర్టిస్టులు ఎవరూ వద్దని.. కొత్త వాళ్లనే పెట్టమని తాను చెప్పినట్లు మోహన్ బాబు వెల్లడించారు. ఒక నెల రోజుల పాటు కొంతమందిని ఆడిషన్ చేశారని కూడా తెలిసిందని.. దీంతో తనకు హీరోయిన్ ఉంటుందనే అనుకున్నానని.. కానీ షూట్ మొదలయ్యాక ఒక షెడ్యూల్ అయినా తన పక్కన ఎవరినీ పెట్టలేదని.. ఇదేంటయ్యా అని అడిగితే ఇందులో మీకు భార్య ఉండదని, ఆ పాత్రను పక్కన పెట్టేశామని శ్రీకాంత్ చావు కబురు చల్లగా చెప్పాడని మోహన్ బాబు తెలిపారు.

షికంజ మాలిక్ పాత్ర ఇంత భయంకరంగా ఉంటుందంటే ఒప్పుకునేవాడిని కాదేమో అంటూ మూవీ ప్రెస్ మీట్లో చెప్పిన మాటలనే మోహన్ బాబు మరోసారి చెప్పారు. తన పాత్ర గురించి శ్రీకాంత్ బాగా చెప్పాడు కానీ.. ఇది అంత వయొలెంట్‌గా ఉంటుందని మాత్రం చెప్పలేదన్నాడు. మరీ గర్భిణిని నరకడం ఏంటయ్యా అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ది ప్యారడైజ్’ టీం చాలా క్రమశిక్షణ కలిగినదని.. తన ప్రమాణాల ప్రకారమే ఉదయం 7 గంటలకే షూట్ చేసేవారని మోహన్ బాబు తెలిపారు. ఐతే తమ షెడ్యూల్ మామూలుగా 8.30కి అయినప్పటికీ.. మోహన్ బాబు మాత్రమే టైం మార్చుకుని షూట్ చేసినట్లు శ్రీకాంత్, నాని తెలిపారు.

This post was last modified on October 1, 2026 7:05 pm

Share

Recent Posts

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

1 hour ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

3 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

6 hours ago